LPG Gas Price : గుడ్ న్యూస్.. ఎల్‌పీజీ గ్యాస్ ధర తగ్గిందోచ్.. ఎంతంటే?

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్ పీజీ గ్యాస్ ధర తగ్గింది... ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ .100 కు తగ్గించాయి.

LPG Gas Price : గుడ్ న్యూస్.. ఎల్‌పీజీ గ్యాస్ ధర తగ్గిందోచ్.. ఎంతంటే?

Lpg Gas Price

LPG Gas Price : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్ పీజీ గ్యాస్ ధర తగ్గింది… ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ .100 కు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ .122 తగ్గించాయి.

ఎల్‌పిజి గ్యాస్ ధర తగ్గింపు తరువాత జూన్ 1 నుంచి సవరించిన ధర సిలిండర్‌కు రూ .1473.50 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్‌కు రూ .1595.50గా ఉంది. మే నెలలో ఎల్‌పిజి గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ .45 తగ్గించాయి. ఎల్‌పిజి గ్యాస్ ధర సిటీ నుంచి సిటీకి మారుతూ ఉంటుంది. భారతదేశం అంతటా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఎల్‌పిజి గ్యాస్ ధర సిలిండర్‌కు రూ .1473.50గా ఉంది. జూన్ 1న ముంబైలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.1422.50. కోల్‌కతాలో ఎల్‌పిజి గ్యాస్ ధర సిలిండర్‌కు రూ .1544.50గా ఉంది. చెన్నైలో 19 కిలోల సిలిండర్‌కు రూ.1603గా ఉంది.

మే నెలలో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .1595.50 కాగా, ముంబైలో సిలిండర్‌కు రూ .1545.00గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పిజి గ్యాస్ ధర మే నెలలో రూ .1667.50 కాగా, గత నెలలో రూ .1725.50గా ఉంది. ఎల్‌పిజి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు రిలీఫ్ లేదు. అంటే 14.2 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.