Hurun Global Rich List 2023: ఎం3ఎం హురున్‌ గ్లోబల్‌ ధనవంతుల జాబితాలో 12 మంది హైదరాబాద్‌ ఫార్మా, రియల్ వ్యాపార ప్రముఖులు

ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌ - 2023‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో దివి కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. గ్లోబల్ ర్యాంకింగ్‌లో 583స్థానాన్ని దక్కించుకుంది. మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో 2,321 ర్యాంకు దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ధనవంతుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు.

Hurun Global Rich List 2023:  ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌ – 2023 లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. భారతదేశంలోని యూఎస్ డాలర్ బిలియనీర్ల ర్యాంకింగ్, సంపదను ఈ ఏడాది జనవరి 14 వరకు పరిగణలోకి తీసుకొని అత్యధిక సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి టాప్-10లో చోటు దక్కించుకున్న వారిలో ముకేష్ అంబానీ ఉన్నారు. ముకేష్ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన దివీస్ లాబోరేటిరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివి సహా, ఫార్మా రంగానికి చెందిన ఏడుగురు, రియల్, నిర్మాణ రంగానికి చెందిన ఐదుగురు వ్యక్తులు, మొత్తం హైదరాబాద్‌కు చెందిన 12మంది వ్యాపార ప్రముఖులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో కొత్తగా ప్రవేశించిన వారిలో రామ్ కీ గ్రూప్‌కు చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు.

China Billionaires : చైనాకు సంపన్నుల బిగ్ షాక్.. సంపద కాపాడుకునేందుకు సింగపూర్‌కు పయనం

తెలుగు రాష్ట్రాల్లోని ధనవంతుల జాబితాలో దివి కుటుంబం తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. గ్లోబల్ ర్యాంకింగ్‌లో 583స్థానాన్ని దక్కించుకుంది. 2022 జాబితాతో పోలిస్తే వారి ర్యాంకు 305 స్థానాలు దిగజారింది. హెటెరో డ్రగ్స్‌కు చెందిన బి. పార్ధసారధి రెడ్డి, అతని కుటుంబం 316 స్థానాలు ఎగబాకి ప్రపంచ వ్యాప్తంగా 686వ ర్యాంకును దక్కించుకున్నారు. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ మిలిటెడ్ ప్రమోటర్లు పిచ్చిరెడ్డి  841వ ర్యాంకుతో, పి.వి. కృష్ణారెడ్డి 864వ గ్లోబల్ ర్యాంకు దక్కించుకొని తెలుగు రాష్ట్రాల్ల నుంచి ధనికుల జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

Forbes India Billionaires List 2022 : ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ అగ్రస్థానం, రెండో స్థానంలో అదానీ..!

ఇక, ఐదవ స్థానంలో MEIL ప్రమోటర్లు సత్యనారాయణ రెడ్డి, కుటుంబ సభ్యులు 694 స్థానాలు ఎగబాకి 1,684 వ గ్లోబల్ ర్యాంకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతుల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా జీఏఆర్‌ కార్పొరేషన్‌ అధిపతి జి. అమరేందర్‌ రెడ్డి కుటుంబం 350 స్థానాలు ఎగబాకి 1,887 ర్యాంకు దక్కించుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ కె. సతీష్ రెడ్డి, అరబిందో ఫార్మా ప్రమోటర్ పి.వి. రాంప్రసాద్రెడ్డిలు ప్రపంచ వ్యాప్తంగా 2,191 ర్యాంకును దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ఏడవ స్థానాన్ని దక్కించుకున్నారు.

Indias Richest Billionaires : ఇండియాలో పెరుగుతున్న ధనవంతులు.. దేశంలో టాప్-10 కుబేరులు వీరే.. కళ్లు బైర్లు కమ్మేంత సంపద

అదేవిధంగా మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో 2,321 ర్యాంకు దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో ధనవంతుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. రెడ్డీస్ లాబోరేటరీ జీవి. ప్రసాద్, అనురాధా ప్రసాద్ 2,774 గ్లోబల్ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. 2,774 గ్లోబల్ ర్యాంకుతో సువెన్ పార్మా కంపెనీ జాస్తి వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల్లో 9వ స్థానంలో నిలిచారు. రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అత్యధిక ధనవంతుల జాబితాలో గ్లోబల్‌లో 2,923 స్థానంను, తెలుగు రాష్ట్రాల్లో 10వ స్థానంను దక్కించుకున్నారు. ఇదిలాఉంటే హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌ – 2023 జాబితాలో భారత దేశం నుంచి 66 మంది బిలియనీర్లతో ముంబై తొలి స్థానంలోనిలవగా, 39 బిలియనీర్లతో న్యూఢిల్లీ రెండో స్థానంలో నిలచింది. 21 మంది బెంగూరు మూడో స్థానంలో, 12 మంది బిలియనీర్లతో హైదరాబాద్, అహ్మదాబాద్ నాలుగో స్థానంలో నిలిచాయి.

ట్రెండింగ్ వార్తలు