డ‌బ్బులు చెట్ల‌కి కాయ‌వు: ఎంత మందు తాగితే.. అంత రుణ‌మాఫీ

2019 సార్వ‌త్రిక ఎన్నికలకు ముందు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలో రైతు రుణ మాఫీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించాలని పాలక ప్రభుత్వాన్ని ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తోంది

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 05:16 AM IST
డ‌బ్బులు చెట్ల‌కి కాయ‌వు:  ఎంత మందు తాగితే.. అంత రుణ‌మాఫీ

2019 సార్వ‌త్రిక ఎన్నికలకు ముందు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలో రైతు రుణ మాఫీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించాలని పాలక ప్రభుత్వాన్ని ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తోంది

2019 సార్వ‌త్రిక ఎన్నికలకు ముందు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అజెండాలో రైతు రుణ మాఫీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించాలని పాలక ప్రభుత్వాన్ని ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తోంది. రుణమాఫీపై రాజ‌కీయ పార్టీల కురిపిస్తోన్న హామీల‌తో మ‌ద్యం అమ్మ‌కాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. నిజానికి ప్ర‌భుత్వ‌నికి అధిక ఆదాయాన్ని రాబ‌ట్టే వ‌న‌రుల్లో లిక్క‌ర్ అమ్మ‌కాలే. మీడియా నివేదికల ప్రకారం, అనేక రాష్ట్రాల్లో లిక్క‌ర్ కంపెనీలు  మద్యంపై పన్నులు పెంచాలనే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో వ్యవసాయ సంక్షోభంతో పోరాడుతోంది. ఈ క్ర‌మంలో మద్యం పన్నుపెంపుతో దేశంలో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తోంది.

ఇటీవ‌ల మధ్యప్రదేశ్, ఛత్తీస్ గ‌ఢ్, రాజస్థాన్తో సహా మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తక్షణ రుణమాఫీ ప‌థ‌కాల‌ను ప్రకటించింది. ప్ర‌స్తుతం లిక్క‌ర్ ప‌న్నుల‌పై 25 శాతం వ‌ర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రెవిన్యూ అందిస్తోంది.  ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు రూ. 1.75 ట్రిలియన్ (25 బిలియన్ డాలర్లు) వరకు ప‌న్నులు ఎత్తివేసినట్లు ప్రకటించాయి. మద్యంపై పన్నులు పెంచినట్లయితే, దాని విలువ‌ MRP పెంపునుకు దారి తీస్తుంది. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రకారం, డిసెంబరు 31, 2018 నాటికి కర్ణాటక ఒక్క రోజులో 70 కోట్ల విలువైన లిక్క‌ర్ విక్ర‌యించింది. లిక్క‌ర్‌,  బీర్ల అమ్మ‌కాలే భారీ క‌ల‌క్ష‌న్లు రాబ‌ట్టాయి.