ఏదీ వదలను : వెబ్ సిరీస్ తీస్తున్న మహేష్
మహేష్ ప్రొడక్షన్‌లో రూపొందబోయే వెబ్ సిరీస్‌కి 'చార్లీ' టైటిల్ ఫిక్స్.

మహేష్ ప్రొడక్షన్‌లో రూపొందబోయే వెబ్ సిరీస్‌కి ‘చార్లీ’ టైటిల్ ఫిక్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాక, పలు ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గానూ, బిజినెస్ మెన్‌గానూ క్షణం తీరికలేకుండా బిజీగా ఉంటాడన్న సంగతి తెలిసందే. రీసెంట్‌గా AMB సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలోకి దిగాడు ప్రిన్స్ మహేష్. ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మించబోతున్నాడు. శ్రీమంతుడు సినిమాతో ప్రొడక్షన్‌లోకి దిగాడు. కొన్ని రోజులుగా భార్య నమ్రత ఆధ్వర్యంలో టాలెంటెడ్ యంగ్ పీపుల్‌తో.. స్మాల్ బడ్జెట్ సినిమాలు నిర్మించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే మహేష్ సినిమాకి బదులు.. వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు.
హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చెయ్యబోయే ఈ వెబ్ సిరీస్‌కి ‘చార్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హుస్సేన్ షా కిరణ్ గతంలో పలు షార్ట్ ఫిలింస్‌తో పాటు, ‘మీకు మీరే మాకు మేమే’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకి స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు అతని డైరెక్షన్‌లో, మహేష్ ప్రొడక్షన్‌లో రూపొందబోయే ‘చార్లీ’ వెబ్ సిరీస్‌ని.. మూడు సీజన్స్‌లో, ఎనిమిది ఎపిసోడ్స్‌గా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. వెబ్ సిరీస్‌తో సూపర్ స్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.