33శాతం పడిపోయిన మారుతీ వాహనాలు

33శాతం పడిపోయిన మారుతీ వాహనాలు

దేశీయ కారు ఉత్పత్తుల్లో అగ్రగామి అయిన మారుతీ సుజుకీ ఆదివారం సంచలన వార్త ప్రకటించింది. ఆగష్టు నెలలో లక్షా 6వేల 413యూనిట్ల అమ్మకాలు ఆగిపోయినట్లు ప్రకటించింది. గతేడాది ఆగష్టులో లక్షా 58వేల 189కార్లు అమ్మిన సంస్థ అమ్మకాల్లో ప్రస్తుత ఏడాది దారుణంగా విఫలమైంది. 

గత నెలతో పోల్చి చూసుకుంటే దేశ వ్యాప్త అమ్మకాల్లో 34.3శాతం పడిపోయాయట. అంటే  లక్షా 47వేల 700కార్లను అమ్మిన సంస్థ ఈ నెలలో 97వేల 61కార్లు మాత్రమే అమ్మిందట. మధ్య తరగతి కుటుంబాలు ఆసక్తి చూపించే ఆల్టో, వాగనార్ లలో కూడా అమ్మకాలు పడిపోయాయట. గతేడాది ఆగష్టులో 36వేలు అమ్ముడుపోతే ప్రస్తుతం 10వేలు మాత్రమే కొనుగోలు చేశారు. 

స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బెలోనో, డిజైర్ అమ్మకాలు 23.9శాతం పడిపోయాయి. విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్, ఎర్టిగా అమ్మకాలు మాత్రం 3.1శాతం పెరిగినట్లు కనిపిస్తున్నాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాలకు ఎగుమతులైన కార్లు కూడా తక్కువగానే ఉన్నాయి.