మైక్రో SUV.. ధర ఎంతంటే? : మారుతీ సుజుకీ S-Presso వచ్చేసింది

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 09:30 AM IST
మైక్రో SUV.. ధర ఎంతంటే? : మారుతీ సుజుకీ S-Presso వచ్చేసింది

దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుంచి మరో కొత్త మినీ (మైక్రో) SUV కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. S-Presso మోడల్ కారు. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలుగా నిర్ణయించారు. ఎంట్రీ సిగ్మంట్ మార్కెట్లో మారుతీ సుజుకీ ఆల్టోను ఈ కొత్త మోడల్ కారు టార్గెట్ చేయనుంది. మారుతీ సుజుకీ ఎరినా రేంజ్ షోరూంల్లో S-Presso మినీ SUV కారు అమ్మకానికి రెడీ కానుంది. మారుతీ సుజుకీ S-Presso కారు మోడల్ స్టాండర్డ్, LXi, VXi, VXi+ మొత్తం 4 వేరియంట్లలో లభ్యం కానుంది.

స్టాండెర్డ్ మోడల్, LXi మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తోంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.3.69 లక్షలు ఉండగా.. ఎక్స్ ఫోరూం ధర రూ.4.05 లక్షలుగా నిర్ణయించారు. అలాగే VXi మోడల్, VXi+ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వచ్చింది. VXi మోడల్ ధర రూ.4.24లక్షలు (మాన్యువల్) ఉండగా.. ఆటోమాటిక్ మోడల్ రూ.4.67లక్షలుగా నిర్ణయించారు. VXi+ మోడల్ ధర రూ.4.48 లక్షలు (మాన్యువల్), ఆటోమాటిక్ మోడల్ ధర రూ.4.91లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

మారుతీ సుజుకీ S-Presso కారు మోడల్ ఇండియాలో తయారైనప్పటికీ మరికొన్ని నెలల్లో గ్లోబల్ మార్కెట్లో లాటిన్ అమెరికా, ఫిలిప్పైయిన్స్, శ్రీలంక, సౌత్ అఫ్రికాలో విక్రయించనుంది. ఈ మోడల్ కార్లను డిజైన్ చేసేందుకు కంపెనీ రూ.640 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగా.. స్థానిక పరంగా 98శాతం కొత్త మోడల్స్ తో మార్కెట్లోకి వస్తున్నట్టు ఎంఎస్ఐ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ తెలిపారు. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* BSVI కంప్లయింట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్
* 67bhp, 90Nm టర్క్యూ 
* CNG ఆప్షన్
* 4 వేరియంట్లు.. స్టాండర్డ్, LXi, VXi, VXi+
* ARAI-24.07kmpl ఫ్యుయల్ ఎఫిషియన్సీ
* 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సు
* AMT గేర్ బాక్సు
* ఆపిల్ కేర్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో
* స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో 
* బ్లూటూత్ కంట్రోల్స్
* HVAC 
* ఫ్రంట్ పవర్ విండోస్
* USB పోర్ట్, A12 V సాకెట్
* డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్
* రియర్- పార్కింగ్ సెన్సార్స్
* స్పీడ్ సెన్సింగ్ డోర్ లాకింగ్