Reliance: రిలయన్స్ భారీ పతనం.. టాప్-10 కంపెనీలతో పాటుగా

గ‌త‌వారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో టాప్ 10 స్క్రిప్ట్‌లు కుప్పకూలాయి. దీంతో రిలయన్స్ ఇండ‌స్ట్రీస్‌తోపాటు టాప్ కంపెనీలు రూ. 2.85 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కోల్పోయాయి.

Reliance: రిలయన్స్ భారీ పతనం.. టాప్-10 కంపెనీలతో పాటుగా

Stock

 

 

Reliance: గ‌త‌వారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో టాప్ 10 స్క్రిప్ట్‌లు కుప్పకూలాయి. దీంతో రిలయన్స్ ఇండ‌స్ట్రీస్‌తోపాటు టాప్ కంపెనీలు రూ. 2.85 ల‌క్ష‌ల కోట్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కోల్పోయాయి. మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్న రిలయన్స్ భారీగా న‌ష్ట‌ాలను చవిచూసింది.

బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బీ ఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 2,225.29 పాయింట్లు (3.89 శాతం), నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్ఎస్ఇ) సూచీ నిఫ్టీ 691.30 పాయింట్లు (4.04 శాతం) న‌ష్ట‌పోయాయి.

అన్నింట్లో రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ త‌న మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.లక్షా 14వేల 767.5 కోట్లు కోల్పోయి రూ.17లక్షల 73వేల 196.68 కోట్లకు పడిపోయింది. ఐటీ దిగ్గ‌జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) ఎం-క్యాప్ రూ.42వేల 847.49 కోట్లు కోల్పోయి రూ.12లక్షల 56వేల 152.34 కోట్ల వద్ద స్థిరపడింది.

Read Also: ఫ్యూచర్ సంస్థ డీల్ ను తెగతెంపులు చేసుకున్న రిలయన్స్: డీల్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన రుణ దాతలు

హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 36వేల 984.46 కోట్లు ప‌త‌న‌మై రూ.7లక్షల 31వేల 68.41 కోట్ల‌తో నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) ఎం-క్యాప్ రూ. 20వేల 558.92 కోట్లు కోల్పోయి రూ.5లక్షల 5వేల 68.14 కోట్ల వ‌ద్ద ముగిసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.16వేల 625.96 కోట్లు ప‌త‌న‌మై రూ.5కోట్ల 136.52 కోట్ల వద్ద స్థిరపడింది. భార‌తీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.16వేల 91.64 కోట్లు నష్టపోయి రూ.3లక్షల 90వేల 153.62 కోట్ల వద్ద ముగిసింది. హౌసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.13వేల 924.03 కోట్లు కోల్పోయి రూ.3లక్షల 90వేల 45.06 కోట్ల వ‌ద్ద స్థిర ప‌డింది.

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 10వేల 843.4 కోట్లు కోల్పోయి రూ.4లక్షల 32వేల 263.56 కోట్లతో స‌రిపెట్టుకుంది. ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ. 10వేల 285.69 కోట్లు న‌ష్ట‌పోయి రూ.6లక్షల 49వేల 302.28 కోట్ల వ‌ద్ద నిలిచింది.

మ‌రోవైపు అదానీ గ్రీన్ ఎన‌ర్జీ ఎం-క్యాప్ రూ.2వేల 322.56 కోట్లు కోల్పోయి రూ.4లక్షల 49వేల 255.28 కోట్ల వ‌ద్ద ముగిసింది.