తొలి రోజే 50 బెంజ్ కార్లు అమ్మిన వైజాగ్ డీలర్

తొలి రోజే 50 బెంజ్ కార్లు అమ్మిన వైజాగ్ డీలర్

లగ్జరీ కార్ల మాన్యుఫ్యాక్చరర్ మెర్సిడెస్ బెంజ్.. వైజాగ్ లో డీలర్‌షిప్ తీసుకున్న రోజే 50కార్లు అమ్మింది. మిండి ప్రాంతంలో మంగళవారం రికార్డు సృష్టించారు ఆ డీలర్. ‘ఎకానమీ పడిపోతుందంటే గతేడాది అక్టోబరు-డిసెంబరు 3వేల 879కార్లను అమ్మగలిగాం. వైజాగ్ డీలర్ క్యాలెండర్ ఇయర్ లో రికార్డు సృష్టించారు. ఇందులో టాప్ స్థానాన్ని సాధించగలిగాం. సంవత్సరం మొత్తంలో 13వేల 786కార్లును అమ్మాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ అయిన మార్టిన్ స్కెవెంక్ ఆరంభోత్సవ సభలో మాట్లాడారు. 

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాం. కొనుగోలు చేసేవారి సామర్థ్యం పెరుగుతుందని ఆశిస్తున్నాం. 2020-21ఆర్థిక సంవత్సరానికి గానూ.. ‘మెర్సిడెస్-బెంజ్ మంత్ర ఇక నుంచి విరామం లేకుండా పనిచేస్తుందని’ అన్నారు. కొత్త కంపెనీలతో పోటీగా సర్వీస్ ప్లాన్లు, బ్రాంచి పాయింట్లు పెంచనున్నట్లు ఆయన అన్నారు. 

‘షోరూమ్‌కు పెట్టుబడి రూ.3.5కోట్లు కాగా అదే సమయానికి గ్రామీణ పట్టణ ప్రాంతాలన్నీ కలిపి 50కార్లు అమ్మగలిగాం. 30వేల చదరపు గజాల్లో 20మంది స్టాఫ్, 10 సర్వీస్ పాయింట్లతో మొదలుపెట్టాం. సంవత్సరానికి 3వేల 600కార్ల వరకూ సర్వీస్ ఇవ్వగలమని అనుకుంటున్నాం’ అని డీలర్ అన్నాడు.