Meta Sued: వినియోగదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై మెటాపై దావా

మెటా సంస్థపై బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాల్లో ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంస్థ 50 మిలియన్ల డేటా దుర్వినియోగంపై మీడియా ప్రకటనల ద్వారా బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. ఇక పోతే, తాన్యా వేసిన దావా ప్రకారం.. గోప్యతా తనిఖీ, ప్రకటన ప్రాధాన్యతల కోసం సాధనాలను మెటా రూపొందించింది. దీనికి ప్రకారం వినియోగదారులు ఏ డేటాను పంచుకున్నారో విశ్లేసించి, వారికి ప్రకటనలు వస్తాయి

Meta Sued: వినియోగదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై మెటాపై దావా

Meta Sued In U.K. To Stop Personal Data Collection For Ads

Meta Sued: వినియోగదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం విషయంలో మెటా(ఫేస్‭బుక్) సంస్థపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ అనేకసార్లు చట్టపరమైన హెచ్చరికలు, విచారణలు ఎదుర్కొంది. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ప్రకటనల కోసం వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని మెటా సేకరిస్తోందని, దాన్ని దుర్వినియోగం చేస్తోందని మెటాపై ఇంగ్లాండులో దావా వేశారు.

ఫేస్‌బుక్ “నిఘా ప్రకటనలను” సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో సాంకేతికత, మానవ హక్కుల ప్రచారకురాలు తాన్యా ఓ’కారోల్ దావా వేశారు. ఆమె తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడబ్ల్యూఓ అనే న్యాయ సంస్థ ప్రకారం.. ఫేస్‌బుక్ తన వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడం, ప్రొఫైల్ చేయడం ద్వారా సాధారణ డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తుందని, ప్రకటనల కోసం మెటా సంస్థనే దాన్ని రూపొందించిదని దావాలో ఆరోపించారు.

మెటా సంస్థపై బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాల్లో ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంస్థ 50 మిలియన్ల డేటా దుర్వినియోగంపై మీడియా ప్రకటనల ద్వారా బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. ఇక పోతే, తాన్యా వేసిన దావా ప్రకారం.. గోప్యతా తనిఖీ, ప్రకటన ప్రాధాన్యతల కోసం సాధనాలను మెటా రూపొందించింది. దీనికి ప్రకారం వినియోగదారులు ఏ డేటాను పంచుకున్నారో విశ్లేసించి, వారికి ప్రకటనలు వస్తాయి. వాస్తవానికి ఈ విషయాన్ని మెటా సంస్థనే ఒక ఈమెయిల్ ద్వారా బహిరంగ పర్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని మెటా సంస్థ కొట్టపారేసింది. తమ వినియోగదారులకు గోప్యత తమకు అత్యంత ప్రాధాన్యమని, ఏదైనా తప్పిదాలు జరిగితే దాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని మెటా ప్రతినిధి పేర్కొన్నారు.

FIFA World Cup 2022 : జియోసినిమాలో ఫిఫా వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లు లైవ్‌లో చూడొచ్చు.. ఏయే ప్లాట్‌ఫారంలో లైవ్‌స్ట్రీమ్ ఉంటుందంటే?