ఇండియాలో ఫస్ట్ ఇంటర్నెట్ కార్లు : త్వరలో రోడ్లపైకి MG హెక్టార్ SUV

ఎంజీ మోటార్ ఇండియా నుంచి కొత్త మోడల్ కార్లు వచ్చేస్తున్నాయి. ఇండియాలో తొలిసారి ఎంజీ కంపెనీ నుంచి ‘హెక్టార్ SUV’పేరుతో కొత్త ఇంటర్నెట్ కార్లు రానున్నాయి.

  • Published By: sreehari ,Published On : May 6, 2019 / 10:59 AM IST
ఇండియాలో ఫస్ట్ ఇంటర్నెట్ కార్లు : త్వరలో రోడ్లపైకి MG హెక్టార్ SUV

ఎంజీ మోటార్ ఇండియా నుంచి కొత్త మోడల్ కార్లు వచ్చేస్తున్నాయి. ఇండియాలో తొలిసారి ఎంజీ కంపెనీ నుంచి ‘హెక్టార్ SUV’పేరుతో కొత్త ఇంటర్నెట్ కార్లు రానున్నాయి.

ఎంజీ మోటార్ ఇండియా నుంచి కొత్త మోడల్ కార్లు వస్తున్నాయి. ఇండియాలో తొలిసారి MG కంపెనీ నుంచి ‘హెక్టార్ SUV’ పేరుతో కొత్త ఇంటర్నెట్ కార్లు రానున్నాయి. ఈ కార్ల ఉత్పత్తికి సంబంధించి ఫస్ట్ ప్రొడక్షన్ వెర్షన్ గుజరాత్ లోని హలోల్ ప్లాంట్ నుంచి ప్రారంభమైంది. ఈ కొత్త మోడల్ కార్ల ఉత్పత్తిపై మే 15, 2019న ఎంజీ కంపెనీ రివీల్ చేయనుంది. ఇండియాలో అతి త్వరలో హెక్టార్ ఎస్ యూవీ కార్లను లాంచ్ చేసేందుకు MG కంపెనీ ప్లాన్ చేస్తోంది. హెక్టార్ ఎస్ యూవీ కార్ల షిప్ మెంట్స్ కొన్నివారాల్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 65 షోరూంల్లోకి ఈ కార్లను దిగుమతి చేయనున్నారు. 2019 జూన్ నెలలో హెక్టార్ SUV ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. 

‘ఇండియాలో తయారైన ఫీచర్ రిచ్ ఇంటర్నెట్ MG హెక్టార్ SUV కారును ప్రవేశపెట్టబోతున్నందుకు గర్వంగా ఉంది. గుజరాత్ ప్లాంట్ నుంచే కొత్త కార్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. హైయస్ట్ క్వాలిటీ, గ్లోబల్ మ్యానిఫ్యాక్చరింగ్ స్టాండ్రర్డ్స్ తో ప్రవేశపెట్టబోతున్నాం. భారతీయ కస్టమర్లకు నచ్చేవిధంగా కార్లను కొత్తగా డిజైన్ చేశాం. రోడ్ల కండీషన్స్, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయనున్నాం. ఎంజీ హెక్టార్ కారు కంపెనీకి కొత్త బెంచ్ మార్క్ గా నిలువనుంది’ అని MG మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. గుజరాత్ ప్లాంట్ లో హెక్టార్ కార్ల తయారీకి ఇప్పటివరకూ ఎంజీ ఇండియా రూ.2వేల 200 కోట్లు పెట్టుబడి పెట్టింది. కొత్త అసెంబ్లీ లైన్ ను ఏర్పాటు చేసింది.

హెక్టార్ కార్లలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ రెండూ రానున్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 డీజిల్ మోటార్ ఉంది. ప్రతి అసెంబ్లీ వర్క్ స్టేషన్ లో టచ్ స్ర్కీన్ ప్యాడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. అసెంబ్లీ ప్రాసెస్ కోసం అడ్వాన్స్ డ్ గైడెడ్ వెహికల్స్ (AGV)తో కొత్త అసెంబ్లీ లైన్ ఆపరేట్ చేస్తోంది. ఇందులో కొత్త ప్రెష్ షాప్, న్యూ బాడీ షాప్, న్యూ పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, టెస్టింగ్ ట్రాక్, ట్రైనింగ్ ఫెసిలిటీ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. 

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే.. 
* iSMART టెక్నాలజీ జనరేషన్ కనెక్టవిటీ సిస్టమ్
* ఇంటర్నెట్ ఫెసిలిటీ స్పెషల్ ఎట్రాక్షన్. 
*10.4 అంగుళాల టచ్ స్ర్కీన్ 
* OTA (Over the Air) టెక్నాలజీ 
సాఫ్ట్ వేర్ అప్ డేట్ ఫీచర్లు, థీమ్స్, టీవీ కంటెంట్
* పవర్ అడ్జెస్టబుల్ సీట్స్, క్రూయిజ్ కంట్రోల్ 
* ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా
ప్యానో రామిక్ సన్ రూఫ్.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్
* రెడ్, సిల్వర్, వైట్ షేడ్ కలర్లు
* ట్రాన్స్ మిషన్ ఆషన్లు, మ్యాన్యువల్, ఆటోమాటిక్ ఆప్షన్
* LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ 
* లార్జ్ బ్లాక్ మెష్ గ్రిల్లే 
* ట్విన్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
* లార్జర్ సెంట్రల్ ఎయిర్ డ్యామ్, సిల్వర్ 
* బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ బంపర్, వీల్ ఆర్క్, సైడ్ బాడీ
* షార్క్-ఫిన్ ఆంటీనా 
* రియర్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ 
* రియర్ వైండ్ షీల్డ్ వైపర్, 
* పెయిర్ LED టెయిల్ ల్యాంప్స్
* రియర్ స్పాయిలర్