MG Motor ZS EV : ఎంజీ మోటార్ ZS EV సరికొత్త మైలురాయి.. 19 కోట్ల కిలోమీటర్లలో 27 మిలియన్ కిలోల CO2 ఆదా..!
MG Motor ZS EV : ఎంజీ మోటార్ ఇండియా కొత్త ZS EV మోడల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 19 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేవలం 27 మిలియన్ కిలోల Co2 (కార్బన్ డైయాక్సైడ్)ను ఆదా చేయడంలో విజయం సాధించింది.

MG Motor India Demonstrates Commitment to Sustainable Mobility
MG Motor ZS EV : 99 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) నుంచి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనం (MG ZS EV) ద్వారా అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఇటీవలే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా MG ZS EV 19 కోట్ల కన్నా ఎక్కువ దూరాన్ని అధిగమించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిచయం చేయడంతో పాటు కార్బన్ పాదముద్రను తగ్గించడమే లక్ష్యంగా ఎంజీ మోటార్ ముందుకు దూసుకెళ్తోంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో కిలోమీటరుకు కేవలం 144.9 గ్రాముల సగటు CO2 ఉద్గారాలతో MG ZS EV మొత్తం 27 మిలియన్ కిలోగ్రాముల CO2 ఆదా చేసిందని కంపెనీ వెల్లడించింది.
భారత్‌కు చెందిన MG ZS EV అద్భుతమైన విజయం సాధించిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారత మార్కెట్లో మొట్టమొదటి ఈయూ వెహికిల్స్‌లో MG ZS EV అగ్రగామిగా నిలిచింది. ఏసీ ఫాస్ట్ చార్జర్లు, ఫోర్టబుల్ ఛార్జర్లు, మొబైల్ సపోర్టింగ్ ఛార్జర్లు, సూపర్ ఫాస్ట్ చార్జర్లు వంటివి ఉన్నాయి. ఈయూ ఛార్జింగ్ సంబంధించి అనేక ప్రాంతాల్లో 1000Ac చార్జర్లను ప్రవేశపెట్టింది. అంతేకాదు.. వెహికల్ యజమానుల్లో ఇంటిలోనూ కంపెనీ సంబంధిత చార్జర్లను ఫ్రీగా ఇన్‌స్టాల్ చేస్తోంది.
ఈ ZS EV వెహికల్ 50.3kWH టెక్నాలజీ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ పడితే.. 461 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. భారత మొట్టమొదటి స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ ZS EV SUV 6 ఛార్జింగ్ ఆప్షన్లతో వస్తుంది. DC సూపర్-ఫాస్ట్ ఛార్జర్‌లు, AC ఫాస్ట్ ఛార్జర్‌లు, MG డీలర్‌షిప్‌లలో AC ఫాస్ట్ ఛార్జర్, ZS EVతో పోర్టబుల్ ఛార్జర్, 24X7 RSA మొబైల్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.

MG Motor India Demonstrates Commitment to Sustainable Mobility
EV ఛార్జింగ్ కోసం దేశ వ్యాప్తంగా 1000 రోజుల్లో కమ్యూనిటీ ప్రదేశాలలో 1000 AC ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. సరికొత్త ZS EV అతిపెద్ద ఇన్-సెగ్మెంట్ 50.3kWH అధునాతన టెక్నాలజీ బ్యాటరీతో వస్తుంది. 176PS బెస్ట్-ఇన్-క్లాస్ పవర్‌ను అందించే శక్తివంతమైన మోటారును కలిగి ఉంది. కేవలం 8.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంటల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV ఒక ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీతో వస్తుంది. మెరుగైన రేంజ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది.
అప్పట్లో బ్రిటీష్ రాజులే ఈ ఎంజీ వాహనాలను వాడేవారు :
1924లో యూకేలో స్థాపించిన మోరిస్ గ్యారేజెస్ వాహనాల్లో స్పోర్ట్స్ కార్లు, రోడ్‌స్టర్‌లు, క్యాబ్రియోలెట్ సిరీస్‌లకు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఎంజీ వాహనాలను బ్రిటీష్ ప్రధానులు, బ్రిటిష్ రాజకుటుంబంతో సహా అనేక మంది ప్రముఖులు ఎక్కువగా వినియోగించారు. యూకేలోని అబింగ్‌డన్‌లో 1930లో స్థాపించిన MG కార్ క్లబ్, వేలాది మంది నమ్మకమైన కస్టమర్లను కలిగి ఉంది. తద్వారా ఈ కార్ బ్రాండ్.. ప్రపంచంలోని అతిపెద్ద క్లబ్‌లలో ఒకటిగా నిలిచింది.
MG గత 99 ఏళ్లలో ఆధునిక, భవిష్యత్తు వినూత్న బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది. గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న MG మోటార్ ఇండియా అత్యాధునిక తయారీ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 వాహనాలు, 3,000 మంది ఉద్యోగులతో విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. భారత మొదటి SUVతో సహా అనేక ఫస్ట్ ఈవీలను దేశంలోకి ప్రవేశపెట్టింది. AI అసిస్టెంట్, అటానమస్ (లెవల్ 2) టెక్నాలజీ, MG కామెట్ EV ది స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ వెహికల్ అందుబాటులో ఉన్నాయి.