ఇండియాలో లాంచ్ : షియోమీ 4 కొత్త Mi TV మోడల్స్ 

  • Published By: sreehari ,Published On : September 17, 2019 / 08:15 AM IST
ఇండియాలో లాంచ్ : షియోమీ 4 కొత్త Mi TV మోడల్స్ 

చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ నుంచి నాలుగు కొత్త Mi TV మోడల్స్ లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ 17న షియోమీ Smart Living 2020 ఈవెంట్ పేరుతో బెంగళూరులో మధ్యాహ్నాం 12గంటలకు లాంచ్ చేసింది. తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చింది. షియోమీ ఇండియా చీప్ మను కుమార్ జైన్ కంపెనీ కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించారు. ఐదేళ్లలో ఇండియన్ మార్కెట్లో 100 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల సేల్స్ జరిగినట్టు జైన్ తెలిపారు. ఈ ఏడాది మరికొన్ని కొత్త స్మార్ట్ డివైజ్ లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ప్రత్యేకించి కొత్త Mi TV మోడల్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. షియోమీ రిలీజ్ చేసే కొత్త డివైజ్ లలో Mi Band 4, 65 అంగుళాల Mi TV, Mi Water Purifier సహా పలు ప్రొడక్టులను ప్రవేశపెడుతోంది. ఆసక్తిగల యూజర్లు షియోమీ అధికారిక యూట్యూబ్ చానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. షియోమీ ఈవెంట్ లో రిలీజ్ చేసే ప్రొడక్టులను ఇదివరకే చైనాలో రిలీజ్ చేసింది. 

అద్భుతమైన ఫీచర్లు ఇవే :
షియోమీ కంపెనీ మొత్తం నాలుగు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ Mi TV మోడల్స్ లాంచ్ చేసింది. 65 అంగుళాల Mi TV 4X మోడల్ పై 40 శాతం వ్యూబుల్ ఏరియాతో ఆఫర్ చేస్తోంది. 55 అంగుళాల Mi TV కంటే అధికంగా ఉంటుంది. స్పోర్ట్స్ మెటల్ డిజైన్ తో పాటు అల్ట్రా స్లిమ్ బెజిల్స్ కూడా ఉన్నాయి. వివిడ్ కలర్ ఇంజిన్ అల్ట్రా బ్రైట్ డిస్ ప్లే ఉంది. ఇందులో 4K UHD రెజుల్యుషన్, HDR 10 సపోర్ట్ చేస్తుంది.

Mi TV 4X 65 అంగుళాల టీవీలో Dolby ఆడియో, DTS HD సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. ప్రత్యేక ఆకర్షణగా PatchWall 2.0 కొత్త వెర్షన్ సపోర్ట్ ఉంది. దీనిద్వారా నెట్ ఫ్లెక్స్ తో పాటు లైవ్ న్యూస్ ను వీక్షించడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్స్, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ 9.0పై రన్ అవుతుంది. క్వాడ్ కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్, 20W స్పీకర్లు, బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. 

సెప్టెంబర్ 29 నుంచి సేల్స్ ప్రారంభం :
మరో రెండు Mi TV మోడల్స్ ను కూడా షియోమీ లాంచ్ చేసింది. Mi TV 4X (43అంగుళాలు), Mi TV 4X (50 అంగుళాలు). ఈ కొత్త టీవీ మోడల్స్ లో కూడా 4K UHD స్ర్కీన్, 20W స్పీకర్లు ఉన్నాయి. మరో స్మార్ట్ టీవీ Mi TV 4A (40 అంగుళాలు) ఫుల్ HD డిస్ ప్లే తో పాటు 20W స్పీకర్లు ఉన్నాయి. కొత్త Mi TV మోడల్స్ లో ఆండ్రాయిడ్ TV కొత్త డేటా సేవర్ ఫీచర్ కూడా ఉందని కంపెనీ తెలిపింది.

ఈ ఫీచర్ తో టీవీలను లాంచ్ చేయడం ప్రపంచంలోనే తొలిసారిగా షియోమీ ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు పరిమిత డేటాతో ఎక్కువ కంటెంట్ వీక్షించే అవకాశం ఉంది. Mi సౌండ్ బార్ బ్లాక్ వెర్షన్ కూడా షియోమీ లాంచ్ చేసింది. అన్ని నాలుగు కొత్త Mi TV మోడల్స్ సేల్స్ సెప్టెంబర్ 29 అర్ధారాత్రి నుంచి ఫ్లిప్ కార్ట్, Mi.comలో ప్రారంభం కానున్నాయి. 

Mi Band 4, స్మార్ట్ వాటర్ Purifier : 
ఇండియాలో Mi Band 3 మోడల్ తో సక్సెస్ అయిన షియోమీ కంపెనీ ఈ ఏడాది కొత్త Mi Band 4 మోడల్ లాంచ్ చేసింది. ఈ ప్రొడక్టు ఇదివరకే చైనాలో లాంచ్ చేసింది. ఇందులో 0.95 అంగుళాల కలర్ AMOLED టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (120×240 ఫిక్సల్స్) రెజుల్యుషన్ ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. షియోమీ కంపెనీ కొత్త Mi Smart వాటర్ ప్యూరిఫైర్ కూడా లాంచ్ చేసింది.

ఇందులో కేవలం రెండు బటన్లు మాత్రమే ఉండగా.. 7 లీటర్ల వరకు ట్యాంకు ఉంది. మొత్తం మూడు విభిన్న ప్యూరిఫైయింగ్ కార్టిడ్జ్ ఆఫర్ చేస్తోంది. ఫస్ట్ కార్టిడ్జ్ ఫీచర్ లో పాలీప్రాపీలేన్ కాటన్, యాక్టివేట్ కార్బన్ ఉంది. రెండో కార్టిడ్జ్ లో RO టెక్నాలజీ ఉంది. మూడో కార్టిడ్జ్ లో పోస్ట్ యాక్టివేటెడ్ కార్బన్ ఉంది. వాటర్ ట్యాంకులో UV ల్యాంప్ కూడా ఉంది. రెండు TDS సెన్సార్లు కూడా ఉన్నాయి. 

Mi 4 స్మార్ట్ టీవీల ధరలు ఇవే :
* Mi TV 4X 65 అంగుళాలు : రూ.54వేల 999
* Mi TV 4X 50 అంగుళాలు : రూ.29వేల 999
* 43-inch Mi TV 4X మోడల్ : రూ.24వేల 999 (రిటైల్)
* Mi TV 4A 40 అంగుళాలు : 17వేల 999