Mi Super Sale : Redmi ఫోన్లపై రూ.4వేలు డిస్కౌంట్

  • Published By: sreehari ,Published On : November 27, 2019 / 08:04 AM IST
Mi Super Sale : Redmi ఫోన్లపై రూ.4వేలు డిస్కౌంట్

ప్రముఖ చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. Mi Super Sale షియోమీ.. తమ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం Mi.comలో నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఎంపిక చేసిన కొన్ని పాపులర్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

రెడ్ మి నోట్ 7 ప్రో, రెడ్ మి K20 సిరీస్, రెడ్ మి నోట్ 7S, రెడ్ మి 7A సహా ఇతర మోడళ్లపై రూ.3వేల నుంచి రూ.4వేల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఎంఐ సూపర్ సేల్‌లో భాగంగా షియోమీ అందించే రెడ్ మి స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Redmi K20 సిరీస్.. రూ.3వేలు తగ్గింపు :
Redmi K20 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది కంపెనీ. రెడ్ మి కె20, రెడ్ మి కె20 ప్రో రెండు మోడళ్లపై రూ.3వేల వరకు ధర తగ్గించింది. Redmi K20 ఫోన్ ప్రారంభ ధర రూ.19వేల 999ల నుంచి అందుబాటులో ఉంది. 6GB ర్యామ్, 64GB స్టోరేజీ వెర్షన్ MRP ధర రూ.22వేల 999గా ఉంది.

ఇక 6GB ర్యామ్, 128GB వెర్షన్ మోడల్ ఫోన్ ధర రూ.22వేల 999గా ఉంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ.23వేల 999గా ఉండగా, దీనిపై డిస్కౌంట్ రూ.1000 తగ్గింపు ధరతో ఆఫర్ చేస్తోంది. Redmi K20లో వెనుక ట్రిపుల్ కెమెరాల సెటప్ (48MP+8MP+13MP), Pop-Up సెల్ఫీ కెమెరా (ఫ్రంట్), ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 

Redmi K20 ప్రో స్మార్ట్ ఫోన్ రూ.3వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 6GB ర్యామ్, 128GB వెర్షన్ MRP ధర రూ.28వేల 999తో పోలిస్తే డిస్కౌంట్ ధర రూ.25వేల 999 నుంచి అందుబాటులో ఉంది. ఇదే వేరియంట్ ఫోన్ లాంచింగ్ సమయంలో ధర రూ.27వేల 999గా కంపెనీ నిర్ణయించింది.

Redmi K20 Pro ఫోన్ మరో వేరియంట్ (8GB RAM + 256GB) స్టోరేజీ మోడల్ ధర రూ.28వేల 999గా ఉంది. దీని ఒరిజినల్ ధర రూ.30వేల 999గా ఉండగా, రూ.2వేల వరకు డిస్కౌంట్ ధరతో ఆఫర్ చేస్తోంది. Redmi K20 ప్రోలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో పాటు స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంది. 

Note 7 Pro, Note 7S డిస్కౌంట్లు :
* Redmi Note 7 Proలో (4GB ర్యామ్ +64GB స్టోరేజీ) ధర రూ.11వేల 999
* 6GB RAM + 64GB వేరియంట్ ధర రూ.13వేల 999.
* 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14వేల 999.
* Redmi Note 7 Proలో మెయిన్ కెమెరా 48MP స్పెషల్ ఎట్రాక్షన్. 

* Redmi Note 7Sలో 48MP కెమెరా.. ఇదో డిఫరెంట్ సెన్సార్. 
* 3GB RAM + 32GB స్టోరేజీ ధర రూ.8వేల 999.
* 4GB RAM + 64GB స్టోరేజీ ధర రూ.9వేల 999.

Redmi 7, Redmi Y3, Poco F1, Redmi 7A డిస్కౌంట్లు :
* Redmi 7 : 2GB RAM + 32GB స్టోరేజీ ధర రూ.6వేల 999
* Redmi 7A : 2GB RAM + 16GB వెర్షన్ ధర రూ.5వేల 499
* మరో వేరియంట్ 2GB ర్యామ్ + 32GB స్టోరేజీ ధర రూ.5వేల 799

* Redmi Y3 : 32MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్) 
* 3GB RAM + 32GB స్టోరేజీ ధర రూ.7వేల 999
* 4GB RAM + 64GB స్టోరేజీ ధర రూ.9వేల 999

* Poco F1 : 4GB RAM + 64GB వెర్షన్ ధర రూ.14వేల 999
* మరో వేరియంట్ 6GB RAM + 128GB వెర్షన్ ధర రూ.15వేల 999