మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పర్మినెంట్‌గా ‘వర్క్ ఫ్రమ్ హోం’

  • Published By: sreehari ,Published On : October 9, 2020 / 10:07 PM IST
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పర్మినెంట్‌గా ‘వర్క్ ఫ్రమ్ హోం’

Microsoft employees : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు పర్మినెంట్‌గా ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చింది. కరోనా మహమ్మారి ఆరంభం నుంచి చాలావరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంట్లోనుంచే ఆఫీసు పనులు చక్కబెడుతున్నారు. ఈ సాఫ్ట్ వేర్ మేకర్ ‘Hybrid Workplace’ గైడెన్స్ ఆవిష్కరించింది. దీనిద్వారా అంతర్గతంగా ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసేందుకు వీలు కల్పించనుంది.



మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ గైడెన్స్ ప్రకారం.. అమెరికాలో ఆఫీసులన్నీ రీ ఓపెన్ అయ్యేంతవరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు పర్మినెంట్ గా ఇంట్లో నుంచే పనిచేయనున్నారు. భవిష్యత్తులోనూ కంపెనీ ఫ్లెక్సిబల్ వర్కింగ్ ప్లాన్ల కోసం ఈ గైడెన్స్ మైక్రోసాఫ్ట్ రూపొందించింది.

ఇప్పటినుంచి 50 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులను ఇంట్లో నుంచే పనిచేసేందుకు అనుమతినిచ్చింది. మేనేజర్లు పర్మినెంట్ రిమోట్ వర్క్ (work from home permanently) ఆమోదించేందుకు అనుమతిచ్చింది. ఉద్యోగుల్లో ఎవరైతే పర్మినెంట్ రిమోట్ వర్క్ ఆప్షన్ ఎంచుకుంటారో తమకు కేటాయించిన కార్యాలయాన్ని వదిలివెళ్లాల్సి ఉంటుంది.

Hardware labs

కానీ, కావాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న టచ్ డౌన్ స్పేస్ వాడుకునేందుకు ఆప్షన్లు ఇచ్చింది. 50 శాతం కన్నా తక్కువ మంది ఇంట్లో నుంచి పనిచేసే ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది మైక్రోసాఫ్ట్. కంపెనీలో కొన్ని రోల్స్ మాత్రం ఇంట్లో నుంచి రీమోట్ వర్క్ చేసేందుకు వీలు పడదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.



కొన్ని రోల్స్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే కంపెనీ ఆఫీసుల్లోనే పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. హార్డ్ వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, ట్రైనింగ్ సెక్షన్ రోల్స్ ఉద్యోగులు మాత్రం ఆయా సౌకర్యాలను యాక్సస్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా రీమోట్ వర్క్ చేసేందుకు ఆమోదం పరంగా అనుమతినివ్వనుంది.



మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా రీమోట్ వర్క్ చేసేందుకు అనుమతినిచ్చింది. కంపెనీ సొంత జియోపే స్కేల్ ఆధారంగా ఉద్యోగులకు పరిహారం, ప్రయోజనాలు అందించనుంది. ఇంట్లో నుంచి పర్మినెంట్ రీమోట్ వర్క్ ఉద్యోగులకు అయ్యే ఖర్చులను కూడా మైక్రోసాఫ్ట్ భరించనుంది. మేనేజర్ ఆమోదం లేకుండానే తమకు నచ్చిన వర్కింగ్ ఆవర్లలో పనిచేసేందుకు కంపెనీ ఉద్యోగులకు అనుమతినిచ్చింది. అవసరమైతే తమ మేనేజర్ల అనుమతితో పార్ట్ టైమ్ వర్క్ కూడా రిక్వెస్ట్ చేసే వెసులుబాటు కల్పించింది.