Motorola New Edge : మోటోరోలా నుంచి న్యూ ఎడ్జ్ సిరీస్ వస్తోంది.. సెప్టెబర్ 8న లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola New Edge : ప్రముఖ మోటరోలా భారత మార్కెట్లో కొత్త ఎడ్జ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్(ల)ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు 8న కొత్త డివైజ్ (Motorola New Edge) అందుబాటులోకి తీసుకురానుంది.

Motorola New Edge : మోటోరోలా నుంచి న్యూ ఎడ్జ్ సిరీస్ వస్తోంది.. సెప్టెబర్ 8న లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola to launch new Edge series smartphone in India on September 8_ All Details You Need Know So far

Motorola New Edge : ప్రముఖ మోటోరోలా భారత మార్కెట్లో కొత్త ఎడ్జ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్(ల)ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబరు 8న కొత్త డివైజ్ (Motorola New Edge) అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్ వర్చువల్ కావచ్చు, భారతీయ మార్కెట్లో అధికారికంగా Dimensity 1050 SoC-పవర్డ్ Motorola Edge (2022)ని లాంచ్ చేసే అవకాశం ఉంది. Moto Tab G62ని దేశంలో లాంచ్ చేసిన కొద్ది రోజుల తర్వాతే ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 8 లాంచ్ భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ (2022)ని లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

అయినప్పటికీ కంపెనీ వివిధ మోనికర్ల కింద Moto X30 Pro లేదా Moto S30 Proని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. మోటోరోలా ఎడ్జ్ (2022) భారత్‌కు వచ్చే ఛాన్స్ ఇప్పటివరకు అత్యధికంగా కనిపిస్తోంది. ఈ నెల ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ప్రారంభమైంది. MediaTek డైమెన్సిటీ 1050 చిప్‌సెట్‌ను కలిగిన మొదటి డివైజ్ కూడా ఇదే. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల Full-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేతో వస్తుంది. నెమ్మదిగా Motorola స్మార్ట్‌ఫోన్‌లకు ప్రమాణంగా మారుతోంది.

Motorola to launch new Edge series smartphone in India on September 8_ All Details You Need Know So far

Motorola to launch new Edge series smartphone in India on September 8

My UX ఇంటర్‌ఫేస్‌తో స్టాక్ Android 12లో రన్ అవుతుంది. Motorola Edge (2022) ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. OIS సపోర్టుతో 50-MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 13-MP అల్ట్రా-వైడ్ సెన్సార్, డెప్త్ సెన్సార్‌ అందిస్తుంది. సెల్ఫీల కోసం 32-MP సెల్ఫీ కెమెరా ఉంది. 30W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్, 5G, బ్లూటూత్ v5.2, NFC సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఇతర ముఖ్య ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అమెరికాలో దీని ధర దాదాపు రూ. 40వేలుగా ఉంది.

భారత మార్కెట్లో Motorola Edge 30 Pro, Motorola Edge 30 మధ్య కూర్చోవచ్చు. Motorola Edge (2022) ధర సుమారుగా రూ. 35వేల వరకు ఉంటుంది. Motorola Edge 30 Pro ధర రూ. 42,999గా ఉంది. మరోవైపు మోటోరోలా Edge 30 ధర రూ.27,999గా ఉంది. కంపెనీ నుంచి మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.

Read Also : Motorola Moto G42 : జూలై 11న మోటో G42 ఫోన్ లాంచ్.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే..!