Mukesh Ambani : మనం రైట్ ట్రాక్‌లోనే ఉన్నాం.. క్రిప్టోకరెన్సీ బిల్లు, డేటా ప్రైవసీకి ముఖేశ్ అంబానీ మద్దతు..!

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ రెండు బిల్లులకు బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పూర్తి మద్దతును ప్రకటించారు.

Mukesh Ambani : మనం రైట్ ట్రాక్‌లోనే ఉన్నాం.. క్రిప్టోకరెన్సీ బిల్లు, డేటా ప్రైవసీకి ముఖేశ్ అంబానీ మద్దతు..!

Mukesh Ambani Backs Data Privacy, Cryptocurrency Bills (1)

Mukesh Ambani : పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ రెండు బిల్లులకు బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పూర్తి మద్దతును ప్రకటించారు. భారత్ అత్యంత ముందస్తు విధానాలను అనుసరిస్తోందని, డిజిటల్ నిబంధనలను సైతం అమలులోకి తెస్తోందని అంబానీ చెప్పారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) హోస్టింగ్ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్‌ (Infinity Forum)లో ముఖేశ్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. భారతీయులు సొంత డేటాను కలిగి ఉండటమే కాకుండా కంట్రోలింగ్ చేయడం, డిజిటల్ డేటాను ఎలా స్టోర్ చేయాలి.. షేరింగ్ చేయడం గురించి కఠినమైన రూల్స్ రూపొందించడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడంతో పాటు పరిరక్షించే హక్కు దేశాలకు ఉందని అంబానీ పేర్కొన్నారు.

డేటా.. న్యూ ఆయిల్ : 
డేటాను ‘న్యూ ఆయిల్’గా అంబానీ అభివర్ణించారు. దేశంలోని ప్రతి పౌరుడి ప్రైవసీ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇండియా.. ఇప్పటికే డిజిటల్ ఐడెంటీలో గుర్తింపు సాధించిందని, ఆధార్, డిజిటల్ బ్యాంక్ అకౌంట్లు, డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఫ్రేమ్‌వర్క్ ఇప్పటికే కలిగి ఉందన్నారు. డేటా ప్రైవసీ బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లలను ప్రవేశపెట్టడమనేది.. వాస్తవానికి చెప్పాలంటే.. మనం ఇప్పుడే సరైన ట్రాక్‌లో ఉన్నామని భావిస్తున్నానని పేర్కొన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై తనకు అపార విశ్వాసం ఉందని అంబానీ స్పష్టం చేశారు. ‘నేను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని విశ్వసిస్తాను… ఎందుకంటే అది క్రిప్టోకరెన్సీకి భిన్నంగా ఉంటుంది’ అని అంబానీ చెప్పారు. చిన్న పెట్టుబడిదారులకు రక్షణగా క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ముఖేశ్ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో.. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టబద్ధమైన టెండర్‌గా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. శాసన సభా అజెండా ‘క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికతను, ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు’ మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీ వచ్చే లాభాలపై పన్ను విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం డిజిటల్ కరెన్సీలపై పూర్తిగా బ్యాన్ చేయాలని కోరుతోంది. దేశం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ముప్పు ఉందని ఆర్బీఐ అభిప్రాయపడుతోంది. డేటా అనేది.. ఒక న్యూ ఆయిల్ వంటిది.. ఈ కొత్త ఆయిల్ అనేది సాంప్రదాయ నూనెకు భిన్నమైనదని అంబానీ చెప్పారు. సాంప్రదాయ చమురును ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతుందన్నారు. అప్పుడు అది కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పారు. డేటా అనే చమురు.. ప్రతిఒక్కరూ ప్రతిచోటా ఉత్పత్తి చేసుకోవచ్చు.. అలాగే వినియోగించవచ్చుని ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

Read Also : Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు