బీఎండబ్యూ కొత్త బైక్.. కళ్లు చెదిరే ధర.. ఎంతో తెలుసా?

బీఎండబ్యూ కొత్త బైక్.. కళ్లు చెదిరే ధర.. ఎంతో తెలుసా?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ ఆటోమొబైల్ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ ఆర్‌ 18 క్లాసిక్‌ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని మార్కెట్ ధర రూ. 24లక్షలు. ఈ బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం 1902 సీసీ కాగా.. ఇందులో 6 గేర్లు ఉంటాయి. రెయిన్‌, రోల్‌, రాక్‌ మోడ్స్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్‌లు ఈ బైక్‌లో ఉంటాయి. పొడవైన విండ్‌ స్కీన్‌ ప్యాసింజర్‌ సీట్‌, ఎల్‌ఈడీ అదనపు హెడ్ లైట్లు, స్యాడిల్‌ బ్యాగ్స్ 16-ఇంచ్‌ ఫ్రంట్‌ వీల్ తో పాటు ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ ట్రక్‌ కంట్రోల్‌, హిల్‌ స్వార్డ్‌ కంట్రోల్‌. కీలెస్‌ రైడ్‌ సిస్టం, ఎలక్రానిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మోటార్‌ సైకిల్‌ సీబీయూ(కంప్లీట్ బిల్డ్‌ యూనిట్‌) మార్గం ద్వారా భారత్‌లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభం అవనున్నట్లు బీఎండబ్య్యూ తెలిపింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 క్లాసిక్‌ పేరిట వచ్చిన ఈ కొత్త బైక్‌ క్రూయిజర్‌ సెగ్మెంట్‌లో సంస్థ తీసుకువచ్చిన రెండో బైక్‌. ఈ బైక్‌ను డీలర్ నెట్‌వర్క్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. బైక్ డెలివరీ త్వరలో ప్రారంభమవుతుంది.

గత సంవత్సరం బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 18 ప్రీమియర్ తరువాత, బిఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా ఇప్పుడు తన కొత్త క్రూయిజర్ సెగ్మెంట్ యొక్క రెండవ ఉత్పత్తి R18 క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది. ఆల్-న్యూ BMW R18 క్లాసిక్ ఒక ఎట్రాక్టివ్ టూరింగ్ బైక్. సంస్థ ప్రకారం, ఈ బైక్ దేశంలో టూరింగ్ క్రూయిజర్ మోడల్‌కు నాంది. చాలా శక్తివంతమైన ఇంజిన్ ఈ బైక్‌లో ఉంది. ఇది సాధారణంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో కనిపిస్తుంది. ఈ ఇంజిన్ 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 91 హెచ్‌పి శక్తిని, 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 158 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 150 Nm టార్క్ 2,000 మరియు 4,000 rpm మధ్య సులభంగా లభిస్తుంది. ఈ శక్తివంతమైన బైక్ రోడ్డుపై స్మూత్‌గా నడుస్తుంది.