గుండెలు అదిరాయా : అన్నీ ఛానళ్లు కావాలంటే నెలకు రూ.6వేలు

ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. డిటిహెచ్ నుంచి లోకల్ కేబుల్ ఆపరేటర్ల వరకు అందరూ TRAI నిబంధనలను తప్పక పాటించాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 31, 2019 / 09:13 AM IST
గుండెలు అదిరాయా : అన్నీ ఛానళ్లు కావాలంటే నెలకు రూ.6వేలు

ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. డిటిహెచ్ నుంచి లోకల్ కేబుల్ ఆపరేటర్ల వరకు అందరూ TRAI నిబంధనలను తప్పక పాటించాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. డిటిహెచ్ నుంచి లోకల్ కేబుల్ ఆపరేటర్ల వరకు అందరూ TRAI నిబంధనలను తప్పక పాటించాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. డిటిహెచ్, లోకల్ కేబుల్ ఆపరేటర్లంతా 25 డిడి ఛానళ్లను ఫ్రీగా.. తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది.

 

ట్రాయ్ అందిస్తోన్న ఛానల్ సెలెక్టర్ ఆప్లికేషన్ ఎంత ఖరీదైనదో తెలిస్తే టీవీ చూసే ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ట్రాయ్ అందించే ఛానల్ సెలెక్షన్ టోటల్ కాస్ట్ రూ.6వేల 137. అమ్మో అని అదిరిపడొద్దు. ఎందుకంటే ఈ రేటుకి కొత్త టీవీ కొనుక్కోవచ్చు. అది ఎలానంటే.. మీరు ఒకవేళ.. డిటిహెచ్, కేబుల్ ఆపరేటర్లు ఇచ్చే అన్నీ ఛానళ్లను SD, HD ఛానళ్లతో కలిపి ఒక్కొక్కటిగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటే టీవీ వీక్షకులు చెల్లించాల్సిన మొత్తం అక్షరాల 6వేలకు పైనే. మీరు చదివింది నిజమే. ట్రాయ్ ఛానల్ సెలెక్టర్ యాప్ ప్రకారం.. ప్యాకేజీలా తీసుకుంటే మాత్రం రూ.5వేల 023 వరకు తగ్గుతుంది. అంటే ఒక వెయ్యి 114 వరకు భారం తగ్గనుంది. ఇందులో 25 వరకు తప్పనిసరి డిడి ఛానల్స్ ఉండగా.. 559 ఉచిత ఛానళ్లు, 330 వరకు పే ఛానళ్లు ఉంటాయి. భారతదేశంలోని అన్ని ఛానళ్లు చూడాలని ఉబలాటపడితే నెలకు రూ.6వేలు ఖర్చవుతుంది. అలా కాకుండా ఛానళ్ల వారీగా తీసుకుంటే అది మీ ఇష్టం. ఉదాహరణకు ఈ టీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలాంటి మాత్రమే తీసుకోవాలి అనుకున్నా కనీసం 75 రూపాయలు అవుతుంది. స్పోర్ట్స్, కార్టూన్ నెట్ వర్క్ లు కంపల్సరీ అనుకుంటే మరో 50 రూపాయలు. టోటల్ గా తెలుగు ప్రేక్షకులు రెగ్యులర్ ఛానల్ లిస్ట్ చూసినా కనీసంలో కనీసం 200 రూపాయలు పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా కాదు అన్ని భాషలు, అన్ని ఛానళ్లు కావాలంటే మాత్రం 6వేలు అవుతుంది అంటోంది ట్రాయ్. ఫిబ్రవరి ఒకటి రానే వచ్చింది.. సెలక్ట్ చేసుకోండి.. ఎంజాయ్ చేయండి.

 

ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ మాటేంటి?
డిటిహెచ్ కస్టమర్లలో ఎక్కువ మంది లాంగ్ డ్యూరేషన్ ప్యాకులపైనే ప్రీపెయిడ్ పేమెంట్స్ చేస్తున్నారు. డిటిహెచ్ కస్టమర్ల ప్యాక్ వ్యవధి ఇంకా చాలా ఉంది. కొంతమంది ఆరు నెలలు, ఏడాది వరకు ప్యాక్స్ ఒకేసారి రీఛార్జ్ చేసుకుని ఉన్నారు. ఇంతలో ట్రాయ్ కొత్త నిబంధనల్లో భాగంగా ఛానల్ సెలక్షన్ ఆప్లికేషన్ తీసుకొచ్చింది. దీంతో ఎగ్జిస్టింగ్ ప్యాకులు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పందించిన ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2019 వరకు ప్యాక్ గడువు ముగియని పక్షంలో డిటిహెచ్ ఆపరేటర్లు అందించే లాంగ్ డ్యూరేషన్ ప్రీపెయిడ్ ప్యాకులను కస్టమర్లు కొనసాగించాలని భావిస్తే కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది. 

 

ఏడాదికిగానూ సబ్ స్క్రిప్షన్లు తీసుకున్న కస్టమర్లు తమ ప్యాక్ గడువు ముగిసేవరకు మాత్రమే వీక్షించే వీలుంది. ప్యాక్ గడువు ముగిసిన వెంటనే కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అంటే.. దీని అర్థం.. కస్టమర్లు పాత ప్యాక్ గడువు ఫిబ్రవరి 1 నాటికి ఎక్స్ ఫెయిరీ కాకపోతే.. కొత్త  ప్లాన్ లోకి మైగ్రేట్ కావాల్సిన అవసరం లేదు. ప్యాక్ కంటిన్యూ కావాలా?వద్దా? లేదా కొత్త ప్లాన్ తీసుకోవాలా? కస్టమర్ చాయస్ పైనే ఆధారపడి ఉంది. ఒకవేళ కస్టమర్ కొత్త ప్యాక్ వేయించుకోవాలనుకుంటే మాత్రం.. వారి అకౌంట్ లో మిగిలి ఉన్న బ్యాలెన్స్ కొత్త ప్లాన్ లోకి అడ్జెస్ట్ అవుతుందని ట్రాయ్ పేర్కొంది. 

 

కస్టమర్ ఏ చాయస్ ఎంచుకోలేదంటే.. 
డిటిహెచ్ కస్టమర్ ట్రాయ్ నిర్దేశించిన ఏ చాయస్ ను తీసుకొని పక్షంలో వారికి బేసిక్ ప్యాక్ రూ.154 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉచిత ఛానళ్లు, తప్పనిసరి 25 ఛానళ్లు మాత్రమే వస్తాయి. పే ఛానళ్లు మాత్రం వీక్షించలేరు.