FDI కొత్త పాలసీ: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ కు భారీ దెబ్బ!

ప్రముఖ ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ సేల్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : February 6, 2019 / 09:19 AM IST
FDI కొత్త పాలసీ: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ కు భారీ దెబ్బ!

ప్రముఖ ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ సేల్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ సేల్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ భారీగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కొత్త పాలసీ విధానం అమల్లోకి రావడంతో రానున్న రోజుల్లో ఆన్ లైన్ మార్కెట్ కు భారీ దెబ్బ తగలనుంది. దీంతో దేశంలో సగానికిపైగా స్మార్ట్ ఫోన్ సేల్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. వచ్చే మూడేళ్లలో అమెజాన్ లో నష్టాలు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. 2018లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు జోరుగా సాగడంతో భారత్ ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 36 శాతానికి చేరింది.

కొత్త ఎఫ్ డీఐ రూల్స్ కారణంగా ఈ కామర్స్ మార్కెట్లలో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నట్టు మోర్గాన్ నివేదిక వెల్లడించింది. ‘‘సేల్స్ పై ప్రభావం తాత్కాలికంగా మాత్రమే ఉండనుంది. మొత్తం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై 32-33 శాతంగా మధ్యస్థంగా ఉండనుంది. కొత్త రూల్స్ ప్రభావంతో 2-3 శాతం పాయింట్లు సేల్స్ తగ్గే అవకాశం ఉంది’’ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పతక్ తెలిపారు. ఈ కొత్త ఈ కామర్స్ రెగ్యులేషన్స్ ఆన్ లైన్ మార్కెట్ ను గాడిలో పెట్టేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. 

యూఎస్ ఇన్విస్ట్ మెంట్ బ్యాంకర్ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. కొత్త ఎఫ్ డీఐ రూల్స్ కారణంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్లాట్ ఫాం నుంచి 25 శాతం ప్రొడక్ట్స్ ను తొలగించాల్సి ఉంటుంది. అందులో బల్క్ సేల్స్ కింద స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపింది. దీనిపై ఫ్లిప్ కార్ట్ కు ఈమెయిల్ పంపగా.. ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొంది. భారత్ లో మొత్తం మీద అన్నీ మొబైల్ ఫోన్ల షిప్పింగ్ 11 శాతానికి పెరిగితే.. స్మార్ట్ ఫోన్లలో ఫీచర్ ఫోన్ల షిప్పింగ్ 10 శాతానికి వేగంగా పెరగనున్నాయి. మరోవైపు చైనా బ్రాండ్స్ ఆన్ లైన్ మార్కెట్ ను షేక్ చేస్తున్నాయి. భారత్ వార్షిక ఆదాయంలో చైనా స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ 60 శాతం రికార్డుతో దూసుకెళ్తున్నాయి. 2017 నుంచి భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ల సేల్స్ 54 శాతం మాత్రమే ఉండగా.. అరవై శాతానికి పెరిగిపోయాయి.

ఈ కొత్త ఎఫ్ డీఐ సంస్కరణలతో రిటైల్ గెయింట్ వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ షేర్ నుంచి తప్పుకొనే అవకాశం ఉందని మోర్గాన్ నివేదిక చెబుతోంది. ఆన్ లైన్ మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్ లు రాబోతున్న తరుణంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్ లైన్ కంపెనీలు అగ్రిమెంట్లు కుదుర్చేసుకున్నాయి. ఇక తమ ప్రొడక్ట్ లను మార్కెట్లోకి లాంచ్ చేయడమే మిగిలి ఉంది. ఈ సమయంలో కొత్త ప్రొడక్ట్ లు లాంచింగ్ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పతక్ తెలిపారు.