డెబిట్, క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 06:21 AM IST
డెబిట్, క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

బ్యాంక్ కస్టమర్లు ఒక ముఖ్య గమనిక. మీరు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారా? అయితే మీ డెబిట్, క్రెడిట్ కార్డుల సైబర్ మోసాలను నియత్రించటానికి, కార్డుల భద్రతను మరింత పెంచటం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని కొత్త రూల్స్ ను జారీ చేసింది. మార్చి 16, 2020 నుంచి రూల్స్ అమలులోకి వచ్చాయి. 

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సెక్యూరిటీ, కార్డు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ భద్రతను  మరింత పఠిష్టంగా చేయటం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జనవరిలో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్లు వారి డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే, కార్డులను రద్దు చేయాలని ఆర్‌బీఐ ఇప్పటికే కార్డు జారీ సంస్థలకు, బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. 

ప్రస్తుతం ఉన్న కార్డులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కార్డు జారీ చేసిన సంస్థలకు పూర్తి అధికారం ఉంటుంది. కార్డుపై ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్సన్లు, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ ఏ వ్యక్తి అయినాక కార్డు ఉపయోగించకపోతే, కార్డు సర్వీసులను రద్దు చేయాలని, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 10(2) నిబంధన ప్రకారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

కొత్త రూల్స్ ప్రకారం ఇక ముందు కస్టమర్లు తమ కార్డులను సంబంధిత ఏటీఏంల ద్వారా స్విచ్ ఆన్, ఆఫ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలను మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్  ద్వారా పొందవచ్చు. కార్డు స్టేటస్ కు సంబంధించిన ఏమైనా మార్పులు ఉంటే ఈ విషయం గురించి ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా కస్టమర్లను హెచ్చరిస్తుంది.

Also Read | దరఖాస్తు చేసుకోండి: ఇగ్నోలో MBA, PHD కోర్సుల్లో ప్రవేశాలు