Nifty – Sensex: నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనం.. పుంజుకున్న ఆయిల్, గ్యాస్, పవర్

ఒకానొక దశలో 1000పాయింట్లకు పతనమైన సెన్సెక్స్ కారణంగా.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ సైతం 1.66 శాతానికి కుంగింది.

Nifty – Sensex: నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనం.. పుంజుకున్న ఆయిల్, గ్యాస్, పవర్

Nifty

Nifty – Sensex: ఒకానొక దశలో 1000పాయింట్లకు పతనమైన సెన్సెక్స్ కారణంగా.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ సైతం 1.66 శాతానికి కుంగింది. మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో తిరిగి తేరుకోగలిగాయంతే. కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.03 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ స్తబ్ధుగా 60,285.89 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రమంగా నష్టాల్లోకి జారుకున్న సూచీ ఐరోపా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో 59,045 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివరకు అమ్మకాల మద్దతుతో కోలుకున్న సూచీ.. 410 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకొని 59,667.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,912-17,576 మధ్య కదలాడి చివరకు 106 పాయింట్లు నష్టపోయి 17,748 వద్ద స్థిరపడింది.

గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్థిరాస్తి, ఐటీ, మీడియా, సేవా, ఆర్థిక సేవలు, ఆటో రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే పీఎస్‌యూ బ్యాంకింగ్‌, కమొడిటీస్‌, ఇంధన, లోహ, ఫార్మా రంగాల షేర్లు సూచీల పతనాన్ని కాస్త కట్టడి చేయగలిగాయి. ఆసియా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా కదలాడాయి.

…………………………………………….: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

బ్రిటన్‌లో ఇంధన కొరత, చైనాలో పరిస్థితుల దృష్ట్యా యూరప్ మార్కెట్లు సైతం నష్టాల్లో కదలాడుతున్నాయి. మరోవైపు ఎవర్‌గ్రాండ్‌, చైనాలో విద్యుత్ కొరత సూచీలను కలవరపెట్టాయి. అమెరికా ఫ్యూచర్స్ సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ పరిణామాలు మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ సూచీల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి.

భారతీ ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూడగా.. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్ షేర్లు రాణించాయి.