ఆల్‌టైమ్ హై: నిఫ్టీ రికార్డు

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 04:51 AM IST
ఆల్‌టైమ్ హై: నిఫ్టీ రికార్డు

ఎన్నికలవేళ సాధారణంగా మందకొడిగా సాగే స్టాక్ మార్కెట్లు.. లాభాలలో ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్‌లో నిఫ్టీ ఇవాళ(3 ఏప్రిల్ 2019) జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,743 వద్ద, సెన్సెక్స్‌ 145 పాయింట్ల లాభంతో 39,201 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  ఉదయం మార్కెట్లు ప్రారంభం అవుతూనే నిఫ్టీ 11,755 మార్కును తాకింది. ఇక బ్యాంక్‌ నిఫ్టీ 0.72 పెరిగి 30,230 వద్ద ట్రేడ్ అవుతోంది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ కూడా 1.20 శాతం లాభపడి 3,460 వద్ద ట్రేడ్ అవుతుంది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 0.25శాతం లాభపడి 7,848 వద్ద ముగిసింది. నేటి మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి.
మంగళవారం(2 ఏప్రిల్ 2019) నాడు కూడా స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  టాటా మోటార్స్‌ దాదాపు 9 శాతం జంప్‌ చేయగా, ఎయిర్‌టెల్‌, ఐషర్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ  టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.