ఎందుకో తెలుసా? : క్రెడిట్ కార్డుతో పెట్రోల్.. నో క్యాష్ బ్యాక్!

క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్. క్యాష్ బ్యాక్ వస్తుందని చాలామంది వాహనదారులు తమ క్రెడిట్ కార్డులతో పెట్రోల్ కొట్టిస్తుంటారు.

  • Published By: sreehari ,Published On : September 25, 2019 / 01:51 PM IST
ఎందుకో తెలుసా? : క్రెడిట్ కార్డుతో పెట్రోల్.. నో క్యాష్ బ్యాక్!

క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్. క్యాష్ బ్యాక్ వస్తుందని చాలామంది వాహనదారులు తమ క్రెడిట్ కార్డులతో పెట్రోల్ కొట్టిస్తుంటారు.

క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్. క్యాష్ బ్యాక్ వస్తుందని చాలామంది వాహనదారులు తమ క్రెడిట్ కార్డులతో పెట్రోల్ కొట్టిస్తుంటారు. కానీ, ఇకపై అలా కుదరదు. పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డుతో పెట్రోల్ కొట్టిస్తే ఇకపై క్యాష్ బ్యాక్ రాదు. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి రెండున్నరేళ్ల క్రితం రాష్ట్ర సొంత చమురు కంపెనీలు డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు 0.75 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించాయి.

‘ప్రియమైన SBI క్రెడిట్ కార్డు యూజర్లు.. పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్యూయల్ ట్రాన్స్ జాక్షన్లపై అందించే  0.75 శాతం క్యాష్ బ్యాక్ నిలిచిపోనుంది. అక్టోబర్ 1, 2019 నుంచి ఇది అమల్లోకి రానుంది’ అని దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు సందేశాలు పంపింది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 86శాతం నోట్ల చెలామణీ తగ్గిపోయింది. దీంతో నోట్ల కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లను సంప్రదించి.. ఫ్యూయల్ ట్రాన్స్ జాక్షన్లపై కార్డు పేమెంట్స్‌పై 0.75శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కేంద్రం అడిగింది. 2016 డిసెంబర్ నెలలో క్రెడిట్ / డెబిట్ కార్డులు, ఈ-వ్యాలెట్లతో ఫ్యూయల్ కొనుగోలు చేస్తే 0.75శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 

అప్పటి నుంచి ఆయిల్ కంపెనీలు క్రెడిట్ కార్డు యూజర్లకు రెండున్నరేళ్లుగా క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తు వస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఆయిల్ కంపెనీలు డిస్కౌంట్లను నిలిపివేయాలని నిర్ణయించినట్టు అధికారి ఒకరు వెల్లడించారు. ఇతర డిజిటల్ పేమెంట్స్ వంటి డెబిట్ కార్డు పేమెంట్స్ కు మాత్రం డిస్కౌంట్ ఆఫర్ కొనసాగుతుందని OMC క్లారిటీ ఇచ్చింది.