క్రెడిట్ కార్డు అక్కర్లేదు : Flipkartలో లక్షల ఖరీదైన వస్తువులు కొనండి.. తర్వాత చెల్లించండి!

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 11:57 AM IST
క్రెడిట్ కార్డు అక్కర్లేదు : Flipkartలో లక్షల ఖరీదైన వస్తువులు కొనండి.. తర్వాత చెల్లించండి!

ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలో మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 29 నుంచి బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫెస్టివల్ సేల్ ప్రారంభమై అక్టోబర్ 4 వరకు సేల్ కొనసాగనుంది. ఈ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ‘కార్డ్ లెస్ క్రెడిట్’ ఫీచర్. 

అంటే.. క్రెడిట్ కార్డు అవసరం లేకుండానే రూ.లక్ష విలువైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తర్వాత కొనుగోలు చేసిన మొత్తాన్ని చెల్లించే అవకాశం కల్పిస్తోంది. ఫెస్టివల్ సేల్ సమయంలో కొనుగోలుదారులు తాము కొనే వస్తువులపై కార్డ్ లెస్ క్రెడిట్ కార్డు పేమెంట్ ఫీచర్ ఎంచుకోవచ్చు.

కార్డ్ లెస్ క్రెడిట్ సదుపాయం పొందాలంటే ఎలాంటి డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫెస్టివల్ షాపింగ్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ యూజర్లు క్రెడిట్ కార్డు వాడకుండా.. పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కంపెనీ ఈ అవకాశం కల్పిస్తోంది. 

* ఫ్లిప్ కార్ట్ కస్టమర్లు మొత్తం మూడు పేమెంట్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
* జీరో వడ్డీతో వచ్చే నెలలో మొత్తం నగదును చెల్లించవచ్చు. 
* మూడు నెలల EMIపై జీరో వడ్డీతో చెల్లించవచ్చు.
* 12 నెలల వరకు Easy EMIతో చెల్లించవచ్చు.
* ప్రాసెసింగ్ ఫీజు లేదు.. సింపుల్ డిజిటల్ KYC ప్రాసెస్ ఉంటుంది.

ఇలా అప్లయ్ చేసుకోండి : 
* మీ క్రెడిట్ లిమిట్ తెలుసుకోవాలంటే మీ PAN వివరాలు ఎంటర్ చేయండి.
* రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో KYC ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
* కార్డ్ లెస్ క్రెడిట్ ఆప్షన్ తో ఫ్లిప్ కార్ట్ పై షాపింగ్ చేసుకోండి.
* మై అకౌంట్స్.. కార్డ్ లెస్ క్రెడిట్.. మీ క్రెడిట్ లిమిట్ చెక్ చేసుకోవచ్చు.
* Flipkart Appపై వచ్చే నెల 15వ తేదీన కొనుగోలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు.