త్వరలో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు.. ఇక లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉండవు!

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 09:18 AM IST
త్వరలో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు.. ఇక లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉండవు!

రాబోయే రోజుల్లో విమానాల్లోనూ డబుల్ డెక్కర్ సీట్లు రానున్నాయి. ఇప్పటివరకూ ఈ తరహా లైఫ్ కేవలం బస్సులు, రైళ్లలోనే చూసి ఉంటారు. త్వరలో విమానా ప్రయాణాల్లోనూ డబుల్ డెక్కర్ సీట్లలోనే కూర్చొవాల్సి ఉంటుంది. విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవారికి లిమిటెడ్ లెగ్ రూమ్ ఉండేవి.

ఇకపై విమానాల్లో ఈ లెగ్ రూమ్స్ కనిపించవు. అన్ని డబుల్ డెక్కర్ సీట్లు మాత్రమే ఉంటాయి. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఈ కొత్త విమానం సీటింగ్ విధానం ప్రవేశపెట్ట నున్నారు. తద్వారా వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తోంది. డిజైనర్  Jeffrey O’Neill ద్వారా విమానయాన సంస్థలు 2-4-2 కాన్ఫిగర్ సీటింగ్ అందించనున్నాయి.
No More Limited Leg Room In Economy Class, Double-Decker Seats On Flights Coming Soon

1970 నుంచి చాలావరకు విమానయాన సీట్లులో మార్పులేదని crowd-funding వెబ్‌సైట్  పేర్కొంది. అన్ని ఎకానమీ క్లాస్ సీట్లలో 99శాతం నిటారుగా నిద్రించడానికి అసాధ్యమనే చెప్పాలి. ఈ వెబ్ సైట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 70శాతం మంది ప్రయాణికులు lie-flat నిద్రించేలా ఏర్పాటు చేస్తారని తేలింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయాణికులందరికీ సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని  అందించనుంది. 
No More Limited Leg Room In Economy Class, Double-Decker Seats On Flights Coming Soon

ఈ డిజైన్ ప్రజలకు డబ్బు ఆదా చేయడమే కాదు.. ఎకానమీ క్లాస్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సాయపడుతుంది. సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో పడుకోవటానికి వీలుగా ఉండేలా సీటింగ్ డిజైన్ ఉంటుంది. విమానయాన సంస్థలు ఏ సీటు సాంద్రత కోల్పోకుండా ఉండేలా చూస్తున్నారు. డబుల్ డెక్కర్ డిజైన్.. విమానం సీట్లు ఇప్పటికే ఉన్న ప్రదేశంలో సీటును తిరిగి అమర్చనున్నారు.