Nokia 4G Mobile Network : 2023 చివరిలోగా చంద్రునిపై నోకియా 4G మొబైల్ నెట్‌వర్క్.. పూర్తి వివరాలు మీకోసం..!
Nokia 4G Mobile Network : 2023 చివరిలోగా చంద్రునిపై 4G మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) నోకియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం.. నోకియా చంద్రునిపై 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Nokia to launch 4G mobile network on the moon in late 2023
Nokia 4G Mobile Network : 2023 చివరిలోగా చంద్రునిపై 4G మొబైల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) నోకియా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం.. నోకియా చంద్రునిపై 4G మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రుని ఆవిష్కరణలను మెరుగుపర్చేందుకు మిషన్‌లో ఉన్న వ్యోమగాములకు అందించనుంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 2023 చివరిలో నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని CNBC నివేదించింది.
టెక్ కంపెనీ రాబోయే నెలల్లో స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. నోవా-సి (Nova-C) లూనార్ ల్యాండర్‌లో స్టోర్ చేసే యాంటెన్నా-అమర్చిన బేస్ స్టేషన్ ద్వారా శక్తిని పొందుతుంది. దీంతో పాటు సౌరశక్తితో నడిచే రోవర్ కూడా ఉంటుంది. ల్యాండర్, రోవర్ మధ్య LTE కనెక్షన్ ఏర్పాటు చేయనుంది. నాసా రాబోయే ఆర్టెమిస్ 1 మిషన్ సమయంలో లేటెస్ట్ 4G నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది. 1972 నుంచి చాలా కాలం తర్వాత చంద్రునిపై నడిచేందుకు మానవ వ్యోమగాములను పంపుతుంది.
MWC 2023లో, నోకియా ఇప్పటికే మూన్ నెట్‌వర్క్ (Moon Network)ను ప్రారంభించాలనే దానిపై ప్రణాళికలను ధృవీకరించింది. కీలకమైన కమాండ్, కంట్రోల్ ఫంక్షన్‌లు, లూనార్ రోవర్‌ల రిమోట్ కంట్రోల్, రియల్ టైమ్ నావిగేషన్, హైడెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్‌తో సహా అనేక విభిన్న డేటా ట్రాన్స్‌మిషన్ అప్లికేషన్‌లకు క్లిష్టమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలను అందించడంలో సాయపడుతుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కోసం కమ్యూనికేషన్ అవసరాలను పరిష్కరించేందుకు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లు సాయపడతాయని నోకియా ఎగ్జిక్యూటివ్ వెల్లడించినట్లు తెలిపింది.

Nokia to launch 4G mobile network on the moon in late 2023
4G నెట్‌వర్క్ ప్రారంభించడం వల్ల వ్యోమగాములు తమ మిషన్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడం సులభతరం చేస్తుంది. నోకియా నెట్‌వర్క్ రోవర్‌ను రిమోట్‌గా కంట్రోల్ చేయడంలో రియల్ టైమ్ వీడియోను ప్రసారం చేయడంతో పాటు టెలిమెట్రీ డేటాను భూమికి తిరిగి పంపడంలో కూడా సాయపడుతుందని పేర్కొంది.
అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివరిలో నోకియా నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. హార్డ్‌వేర్ సిద్ధంగా ఉంటే.. అది ఉన్నట్లుగా వెరిఫై అయితే.. లాంచ్ పార్టనర్ ఆప్షన్లలో ఎలాంటి ఎదురుదెబ్బలు లేదా జాప్యాలు లేనంత వరకు 2023లో లాంచ్ చేసేందుకు మంచి అవకాశం ఉందని మూర్ ఇన్‌సైట్స్‌లో ప్రధాన విశ్లేషకుడు అన్షెల్ సాగ్ బృందం పేర్కొంది. నోకియా మూన్ నెట్‌వర్క్ సాయంతో చంద్రునిపై మంచును కనుగొనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.
చంద్రుని ఉపరితలం చాలా వరకు పొడిగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. చంద్రునికి ఇటీవలి కొన్ని ఇంటర్నల్ మిషన్లు ధ్రువాల చుట్టూ ఉన్న క్రేటర్లలో కొన్ని మంచు మిగిలిపోయినట్లు గుర్తించారు. ఈ మంచు నీటిని తాగేందుకు ఉపయోగపడనుంది. హైడ్రోజన్‌గా, ఆక్సిజన్‌గా మార్చి రాకెట్‌లకు పవర్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ మంచు నీటిని కూడా వేరు చేయవచ్చు. వ్యోమగాములకు ఆక్సిజన్ అందించడంలోనూ సాయపడుతుంది.
Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!