Nothing Wirless Ear: Ear-2 విడుదల చేసిన Nothing

Nothing యొక్క మొదటి తరపు ఆడియో ఉత్పత్తితో పోలిస్తే మరింత మెరుగ్గా Ear(2)ను సృష్టించారు. ఇది వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతమైన వినికిడి అనుభవాలను అందిస్తుంది. ఇది ప్రతిరోజూ అవసరాలను తీర్చనుంది. దీనిలో డ్యూయల్‌ కనెక్షన్‌, వ్యక్తిగతీకరించిన సౌండ్‌ ప్రొఫైల్‌ ఉన్నాయి. వీటితో పాటుగా Nothing అత్యాధునిక క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంది.

Nothing Wirless Ear: Ear-2 విడుదల చేసిన Nothing

Nothing released wirless ear 2

Nothing Wirless Ear: లండన్‌ కేంద్రంగా నడుస్తోన్న సాంకేతిక బ్రాండ్‌, నథింగ్‌ (Nothing), ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ సెట్‌ ఇయర్‌-2 ను విడుదల చేసింది. Nothing ప్రతిష్టాత్మక పారదర్శక డిజైన్‌ను ఎలైట్‌ ఇంజినీరింగ్‌, మరోదశ వ్యక్తిగతీకరణను అత్యుత్తమ ఆడియో అనుభవాల కోసం అందించేలా తీర్చిదిద్దారు. ఆధీకృత శబ్ద అనుభవాలను Ear (2) అందిస్తుంది. దీనిలో హై–రిజల్యూషన్‌ ఆడియో సర్టిఫికేషన్‌, ఎల్‌హెచ్‌డీసీ 5.0 సాంకేతికత ఉంది. వినియోగదారులు తమ సొంత సౌండ్‌ ప్రొఫైల్‌ను నథింగ్‌ ఎక్స్‌ (NothingX)యాప్‌పై వినికిడి పరీక్ష చేసుకోవడం ద్వారా నిర్ధేశించుకోవచ్చు.

Ear (2) ఈ ఈక్విలైజర్‌ సెట్టింగ్స్‌ను రియల్‌ టైమ్‌లో అత్యుత్తమ శబ్ద నాణ్యత కోసం మార్చుకుంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో 11.6 మిల్లీ మీటర్ల కస్టమ్‌ డ్రైవర్‌ లోతైన, అత్యంత శక్తివంతమైన బాస్‌, క్రిస్టల్‌ క్లియర్‌ హైస్‌ కోసం కలిగి ఉండటంతో పాటుగా నూతన డ్యూయల్‌ చాంబర్‌ డిజైన్‌ మొత్తంమ్మీద శబ్ద నాణ్యతను మృదువైన గాలి ప్రవాహంతో అందిస్తుంది. అంతేకాదు, అతి సులభంగా డివైజ్‌ల మధ్య మారేందుకు డ్యూయల్‌ కనెక్షన్‌ సైతం Ear (2)లో ఉంటుంది. ఇది గాలి నిరోధతను మెరుగుపరచడంతో పాటుగా, క్రౌడ్‌–ఫ్రూఫ్‌ క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ, పర్సనలైజ్డ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉంటుంది. ఇది వినూత్నమైన రీతిలో వినియోగదారుల ఇయర్‌ కెనాల్‌ ఆకృతిలో ఉంటుంది.

‘‘మా తొలి ఉత్పత్తి EAR(1)కు ప్రతిష్టాత్మక ఆధునీకరణలను చేసి Ear(2) పరిచయం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇప్పటికే Ear(1)ను 6లక్షల యూనిట్లకు పైగా విక్రయించాము’’ అని కార్ల్‌ పీ, సీఈఓ, కో–ఫౌండర్‌ అన్నారు. ‘‘EAR(2)తో మేము ప్రతి ఒక్కటీ ఆధునీకరించాము. అత్యుత్తమ వ్యక్తిగత శ్రవణ అనుభవాలను సైతం సృష్టించేందుకు విప్లవాత్మక సాంకేతికత సృష్టించాము’’ అని అన్నారు.

పూర్తిగా లీనమయ్యే శబ్ద అనుభవాలను అందించడం కోసం హై–రిజల్యూషన్‌ ఆడియో సర్టిఫైడ్‌గా Ear(2) ఉంటుంది. ఇది మిమ్మల్ని రికార్డింగ్‌ స్టూడియోకు తీసుకువెళ్తుంది. LHDC 5.0 codec సాంకేతికత అతి సూక్ష్మమైన శబ్ద వివరాలు సైతం స్పష్టంగా వినగలరనే భరోసాను అందిస్తుంది. ఇది పరిశ్రమలో అత్యున్నత ప్రమాణంగా నిలువడంతో పాటుగా 24 బిట్‌/192 కిలోహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీని 1ఎంబీపీఎస్‌ వేగాలతో అందిస్తుంది.

Ear(2)లో 11.6 మిల్లీ మీటర్‌ డైనమిక్‌ డ్రైవర్‌, కస్టమ్‌ డయాఫారంతో ఉంది. ఇది మెరుగైన ఎకౌస్టిక్‌ పనితీరు అందిస్తుంది. పాలీయురేథిన్‌, గ్రాఫైన్‌ మెటీరియల్స్‌ సమ్మేళనంతో డిజైన్‌ చేసిన ఈ ఇయర్‌ బడ్స్‌ మరింత మెరుగైన ఫ్రీక్వెన్సీలు, లోతైన, మృదువైన బాస్‌ అందిస్తుంది. దీనితో పాటుగా వినూత్నమైన డ్యూయల్‌ ఛాంబర్‌ డిజైన్‌ ఉండటంతో పాటుగా భారీ స్పేస్‌ను మృదువైన ఎయిర్‌ ఫ్లో, మరింత స్పష్టమైన శబ్దం అందిస్తుంది.

Nothing యొక్క మొదటి తరపు ఆడియో ఉత్పత్తితో పోలిస్తే మరింత మెరుగ్గా Ear(2)ను సృష్టించారు. ఇది వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతమైన వినికిడి అనుభవాలను అందిస్తుంది. ఇది ప్రతిరోజూ అవసరాలను తీర్చనుంది. దీనిలో డ్యూయల్‌ కనెక్షన్‌, వ్యక్తిగతీకరించిన సౌండ్‌ ప్రొఫైల్‌ ఉన్నాయి. వీటితో పాటుగా Nothing అత్యాధునిక క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంది.