మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై రీడమ్‌కు PAN తప్పనిసరి

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెడుతున్నారా? ఇకపై అన్ని మ్యూచువల్ ఫండ్ లావాదేవీలతో పాటు నిధుల చెల్లింపునకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) తప్పనిసరి చేస్తూ AMFI ఒక ప్రకటనలో తెలిపింది.

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 02:06 PM IST
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై రీడమ్‌కు PAN తప్పనిసరి

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెడుతున్నారా? ఇకపై అన్ని మ్యూచువల్ ఫండ్ లావాదేవీలతో పాటు నిధుల చెల్లింపునకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) తప్పనిసరి చేస్తూ AMFI ఒక ప్రకటనలో తెలిపింది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెడుతున్నారా? ఇకపై అన్ని మ్యూచువల్ ఫండ్ లావాదేవీలతో పాటు నిధుల చెల్లింపునకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) తప్పనిసరి చేస్తూ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) ఒక ప్రకటనలో తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టబడిదారులంతా తమ PAN నెంబర్ ను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా AMFI సూచించింది.

తమ పెట్టుబడులను రీడమ్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పాన్ యాడ్ చేసుకోవాలని లేని పక్షంలో ఆయా లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉందని తెలిపింది. AMFI ఆదేశాల మేరకు.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు తమ KYC వివరాలను PAN కార్డుతో అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రీడమ్ పొందేందుకు వీలుంటుందని వెల్లడించింది. 

ఇటీవల సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) మ్యూచువల్ ఫండ్లను తనిఖీ చేసిన నేపథ్యంలో చాలామంది ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు PAN కార్డు వివరాలు లేకుండానే రీడమ్షన్ రీక్వెస్ట్ పెట్టినట్టు గుర్తించింది. అనంతరం సెబీ పాన్ కార్డు వివరాలు జత చేయడం తప్పనిసరి చేస్తూ ఈ ప్రకటన జారీ చేసింది.

అదేవిధంగా.. కొన్ని కేటగిరీలకు చెందిన పెట్టుబడిదారులకు PAN కార్డు అవసరం లేదు. ఏడాదికి ఒక సింగిల్ మ్యూచువల్ ఫండ్ కలిగిన పెట్టుబడిదారుల్లో ప్రతి ఏటా రూ.50వేల వరకు పెట్టుబడి పెడితే మాత్రం వారు తమ పాన్ కార్డు వివరాలను జత చేయాల్సిన పని లేదు. 

వీరంతా పాన్ కార్డు స్థానంలో ప్రభుత్వ ఆమోదిత గుర్తింపు కార్డులను అందించాల్సి ఉంటుంది. ‘పాన్ కార్డు మినహాయింపు లేని పత్రాలకు సంబంధించి, రీడమ్ / తిరిగి కొనుగోలు చేసే లావాదేవీలకు పాన్ అవసరం. రీడమ్ విషయంలో యూనిట్ హోల్డర్ పాన్ సేకరించడానికి AMCs/RTAs కూడా అంతే అవసరం. కొన్ని సందర్భాల్లో గతంలో పాన్ వివరాలను సమర్పించని యెడల.. పాన్-మినహాయింపు లేని పత్రాలకు సంబంధించి పాన్ లేకుండా పొందిన రుణ విమోచన లావాదేవీలు తిరస్కరించబడతాయి ’అని AMFI తెలిపింది.