October నెలలో Bank Holidays

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 11:56 AM IST
October నెలలో Bank Holidays

Bank Holidays : బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి. అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు పని చేయవు. పండుగలు, సాధారణ సెలవులు వచ్చాయి. సెలవుల్లో రెండు, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం..అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులకు సెలవు అనే సంగతి తెలిసిందే.



ఈ నెలలో గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti), మహాసప్తమి (Mahashaptami), దసరా పండుగ (Dussehra), మిలాద్ ఉన్ నబీ(Eid-e-Milad)లు వచ్చాయి. ఇక అక్టోబర్ 04, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. అక్టోబర్ 10, 24 తేదీల్లో రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో నవమి, దసరా పండుగలు వచ్చాయి.



ప్రధాన సెలవులు.
అన్ని రాష్ట్రాలు, అక్టోబర్ 2 (శుక్రవారం) – మహాత్మా గాంధీ జయంతి
ప్రాంతీయ, అక్టోబర్ 8 (గురువారం) – చెల్లం
చాలా రాష్ట్రాలు, అక్టోబర్ 23 (శుక్రవారం) – మహాసప్తమి



చాలా రాష్ట్రాలు, అక్టోబర్ 26 (సోమవారం) – విజయ దశమి
ప్రాంతీయ, అక్టోబర్ 29 (గురువారం) – మిలాద్ ఉన్ నబీ
ప్రాంతీయ, అక్టోబర్ 31 (శనివారం) – మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి