Okinawa Okhi-90: అల్ట్రా స్టైలిష్ లుక్‌తో వచ్చిన “ఒకినావా ఓఖీ-90” ఎలక్ట్రిక్ స్కూటర్: ధర ఎంతంటే?

ఇప్పటికే మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఓలా, అథెర్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తుంది.

Okinawa Okhi-90: అల్ట్రా స్టైలిష్ లుక్‌తో వచ్చిన “ఒకినావా ఓఖీ-90” ఎలక్ట్రిక్ స్కూటర్: ధర ఎంతంటే?

Okinawa

Okinawa Okhi-90: భారత్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జోరు కొనసాగుతుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తయారీ సంస్థలు పోటాపోటీగా కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే అథెర్, ఓలా, వన్, యాంపియర్ వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలో భారత మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇక దేశీయ సంస్థ ఒకినావా కూడా మరో సరికొత్త మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒకినావా ఓఖీ-90 పేరుతో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లు..ఓలా, అథెర్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తుంది. ఇక ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ సరికొత్త “ఒకినావా ఓఖీ-90” స్కూటర్ ధరను రూ.1.21 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది ఒకినావా సంస్థ.

Also read:Airtel Xstream Box price : రూ.2 వేలకే ఎయిర్ టెల్ Xstream బాక్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ కూడా..!

“ఒకినావా ఓఖీ-90” ప్రత్యేకతలు:
ఒకినావా Okhi-90 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8kWh మోటార్ తో పనిచేస్తుంది. ఎకో మరియు స్పోర్ట్స్ అనే 2 విభిన్న రైడింగ్ మోడ్‌లతో ఈ మోటర్ పనిచేస్తుంది. ఎకో మోడ్‌లో, స్కూటర్ గరిష్టంగా 55 నుండి 60 kmph వేగాన్ని అందుకోగలదు. అయితే స్పోర్ట్స్ మోడ్‌లో 85 నుండి 90 kmph వరకు వేగం అందుకోగలదని సంస్థ పేర్కొంది. ఇక గరిష్టంగా 10 సెకన్లలో 0 నుండి 90 kmph వరకు వేగం అందుకోగలదు. ఈ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మొట్టమొదటిసారిగా 16 అంగుళాల టైర్ తో ఈ ఓఖీ-90 స్కూటర్ వస్తుందని సంస్థ తెలిపింది. దీంతో పాటుగా ముందు వెనుక LED లైట్స్, ఇన్ బిల్ట్ నావిగేషన్, కీలెస్ స్టార్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB పోర్ట్ మరియు పూర్తి డిజిటల్ స్పీడోమీటర్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒకినావా సంస్థకు డీలర్ షోరూంలలో ఈ స్కూటర్ అందుబాటులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

Also Read:OnePlus 10 Pro 5G : వన్‌ప్లస్ 10ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ఎప్పుడంటే?