OLA: ఈవీ అమ్మకాల్లో హీరోను దాటిన ఓలా

ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో హీరో కంపెనీని దాటి ఓలా సంస్థ టాప్ పొజిషన్‌లో నిలిచింది. గత ఏప్రిల్ అమ్మకాల్లో ఓలా అత్యధికంగా 12,683 టూ వీలర్స్ అమ్మింది.

OLA: ఈవీ అమ్మకాల్లో హీరోను దాటిన ఓలా

Ola

OLA: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాల్లో హీరో కంపెనీని దాటి ఓలా సంస్థ టాప్ పొజిషన్‌లో నిలిచింది. గత ఏప్రిల్ అమ్మకాల్లో ఓలా అత్యధికంగా 12,683 టూ వీలర్స్ అమ్మింది. మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 39 శాతం ఎక్కువ. ఓలా అమ్మకాలు దూసుకెళ్తె.. హీరో కంపెనీ టూ వీలర్ సేల్స్ మాత్రం దాదాపు యాభై శాతం పడిపోయాయి. హీరో కంపెనీ గత ఏప్రిల్‌లో 6,570 వాహనాల్ని మాత్రమే అమ్మగలిగింది. ఒకినావా సంస్థ 10,000 కంటే ఎక్కువ స్కూటర్లు అమ్మి, ఏప్రిల్ నెలకు సంబంధించి రెండో స్థానంలో నిలిచింది.

Electric Bike Catches Fire : వామ్మో ఎలక్ట్రిక్ బైక్.. నడుపుతుండగా సీటు కింద నుంచి ఒక్కసారిగా మంటలు

వాహన్ సంస్థ సర్వే ప్రకారం గత డిసెంబర్ నుంచి ఓలా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాల్లో హీరో మూడో స్థానంలో ఉంటే, యాంపిరె సంస్థ నాలుగో స్థానంలో, ఏథర్ ఐదో స్థానంలో నిలిచింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయిన ఘటన తర్వాత కూడా ఆ సంస్థ సేల్స్ పెరగడం విశేషం. మరోపక్క ఇప్పటివరకు హీరో కంపెనీకి సంబంధించి ఎలాంటి ప్రమాదాలు జరగకున్నా, ఆ సంస్థ బైకుల అమ్మకాలు తగ్గిపోయాయి.