Ola Bike Sales: సరికొత్త రికార్డు.. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన బైక్‌ల అమ్మకాలు

కేవలం రెండు రోజుల్లోనే రూ .1100 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై ప్రజలలో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది.

Ola Bike Sales: సరికొత్త రికార్డు.. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన బైక్‌ల అమ్మకాలు

Ola Bike

Ola Bike Sales: కేవలం రెండు రోజుల్లోనే రూ .1100 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై ప్రజలలో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది. రెండు రోజుల్లోనే రూ.1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసినట్లు ఓలా గ్రూప్ సీఈఓ భవీష్‌ అగర్వాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కంపెనీ ప్రస్తుతం కొనుగోలు నిలిపివేయగా.. దీపావళి కానుకగా నవంబర్ 1న మరోసారి కొనుగోలుకు అవకాశం ఇవ్వనుంది. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 4న జరగనుంది.

అగర్వాల్ తన బ్లాగ్‌లో.. “కేవలం రెండు రోజుల్లో, ఓలా బైక్‌ల అమ్మకాలు రూ. 1100కోట్లు దాటాయని, ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే కాదు.. భారతీయ ఈ-కామర్స్ పరిశ్రమ చరిత్రలో ఏ ఒక్క ఉత్పత్తి ఈ విధంగా విక్రయించిన రికార్డు లేదు” అని రాసుకొచ్చారు. దేశం ఇప్పుడు డిజిటల్ యుగంలోకి ప్రవేశించిందని, ఈ బైక్‌ల డెలివరీలు వచ్చే నెల అక్టోబర్ 2021 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. కొనుగోలు చేసిన వారికి 72 గంటలలోపు డెలివరీ తేదీ గురించి సమాచారం ఇవ్వనున్నట్లు చెప్పారు. తొలి రోజు సేల్స్‌ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ అగర్వాల్ ట్వీట్‌ చేశారు.

ఆన్‌లైన్ అమ్మకాలు స్టార్ట్ చేసిన మొదటి రోజు, కంపెనీ రూ.600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మి రికార్డ్ క్రియేట్ చెయ్యగా.. 48 గంటల సేల్‌ సెప్టెంబరు 16న ముగిసింది. కస్టమర్లు స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది కంపెనీ. కేవలం రూ. 499 వద్ద ఆన్‌లైన్‌లో ప్లాట్‌ రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించింది కంపెనీ. ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్‌ చేసినా, రిజర్వేషన్లు olaelectric.com ఓపెన్‌లో ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు.

ఇప్పటికే బుక్ చేసుకుని కొనుగోలు చెయ్యనివారికి కూడా నవంబర్ 1వ తేదీ నుంచి అవకాశం ఇవ్వనుంది కంపెనీ. ఓలా ఎస్ 1 బైక్ ధర రూ .99,999 మరియు S1 ప్రో ధర రూ .1,29,999 వద్ద ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర, ఇందులో FAME II సబ్సిడీ ఉంటుంది కానీ స్టేడ్ సబ్సిడీ కాదు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్‌ 1 గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్‌1 ప్రో గరిష్ట వేగం 181-115 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.