OnePlus 10T 5G : ఆగస్టు3న వన్‌ప్లస్ 10T 5G స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే సేల్ డేట్, ఆఫర్లు లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ రానుంది. ఆగస్టు 3న భారత మార్కెట్లో OnePlus 10T 5G లాంచ్ కానుంది.

OnePlus 10T 5G : ఆగస్టు3న వన్‌ప్లస్ 10T 5G స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే సేల్ డేట్, ఆఫర్లు లీక్!

Oneplus 10t 5g India Price, Sale Date And Offers Leaked Ahead Of August 3 Launch

OnePlus 10T 5G India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ రానుంది. ఆగస్టు 3న భారత మార్కెట్లో OnePlus 10T 5G లాంచ్ కానుంది. iQOO 9T 5G లాంచ్ తర్వాత ఈ వన్ ప్లస్ కొత్త ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాకముందే ఈ 5G ఫోన్ ధర, సేల్ డేట్, ఆఫర్లకు సంబంధించి సమాచారం లీక్ అయింది. లీకైనా డేటా ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో రానుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర దాదాపు రూ.55వేలు ఉంటుందని పుకార్లు వచ్చాయి. OnePlus 10T 5G భారత ధర, సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్ వివరాలను వెల్లడించినట్లు కొత్త నివేదిక పేర్కొంది.

ధర ఎంతంటే? :
OnePlus 10T 5G భారత మార్కెట్లో 3 స్టోరేజీ ఆప్షన్లతో 8GB RAM, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.49,999గా ఉండనుంది. 12GB + 256GB వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 54,999గా ఉండనుంది. OnePlus 10T 5G కూడా 16GB RAM ఆప్షన్‌తో వస్తుంది. దీని ధర రూ. 55,999గా ఉండనుంది.

Oneplus 10t 5g India Price, Sale Date And Offers Leaked Ahead Of August 3 Launch (1)

Oneplus 10t 5g India Price, Sale Date And Offers Leaked Ahead Of August 3 Launch 

Z గ్రీన్, మూన్‌స్టోన్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని లీక్ డేటా తెలిపింది. ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 16GB RAM ఆప్షన్ ఒకే మూన్‌స్టోన్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఆగస్టు 6 నుంచి అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో సేల్ అందుబాటులో ఉండనుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా.. OnePlus 10T 5Gని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 48,499కి తగ్గనుంది.

స్పెసిఫికేషన్లు ఇవే (అంచనా) :
వన్‌ప్లస్ 10T 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. హాసెల్‌బ్లాడ్-ట్యూనింగ్ ట్రీట్‌మెంట్ బదులుగా 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా, 16MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో రానుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందించనుంది.

డిస్‌ప్లే ఫ్లాట్‌గా ఉండనుంది. 32MP ఫ్రంట్ కెమెరా టాప్ సెంటర్‌లో హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. హుడ్ కింద.. 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4800 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో లాంచ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్ OS 12.1 ద్వారా రన్ అవుతుంది.

Read AlsoOnePlus 10T 5G : అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?