OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి 10T సిరీస్ వస్తోంది.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

భారత్, గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న అధికారికంగా OnePlus 10T లాంచ్ కానుంది. న్యూయార్క్ నగరంలో లాంచ్ ఈవెంట్ జరుగనుంది.

OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి 10T సిరీస్ వస్తోంది.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus 10T launches today, India price expected to be under Rs 50,000

OnePlus 10T : భారత్, గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న అధికారికంగా OnePlus 10T లాంచ్ కానుంది. న్యూయార్క్ నగరంలో లాంచ్ ఈవెంట్ జరుగనుంది. భారతీయ యూజర్లు OnePlus 10T లాంచ్ లైవ్ ఈవెంట్ OnePlus YouTube, సోషల్ మీడియా ఛానెల్‌లలో వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం (IST) రాత్రి 7:30 గంటలకు OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ రెండేళ్ల తర్వాత T సిరీస్ ఫోన్‌ను తీసుకొస్తోంది. OnePlus T ఫోన్, OnePlus 8T, OnePlus 9T స్మార్ట్ ఫోన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. OnePlus T సిరీస్ మళ్లీ లాంచ్ చేయడంతో OnePlus 10Tపైనే అందరి దృష్టి ఉంది. OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నట్టు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. చాలా కాలంగా ఇంటర్నెట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించి అనేక లీక్‌లు వచ్చాయి.

డిజైన్, స్పెసిఫికేషన్లు ఇవేనా..
ఇప్పటికే ఈ ఫోన్ పూర్తి డిజైన్‌ను వన్ ప్లస్ వెల్లడించింది. OnePlus 10T లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ 10pro మాదిరిగానే గ్రీన్, బ్లాక్ రెండు కలర్లలో వస్తోంది. హాసెల్‌బ్లాడ్ పార్టనర్ షిప్ లేకపోయినా పర్ఫార్మెన్స్ పరంగా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. OnePlus 10T బ్రాండ్ నుంచి Qualcomm లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ (స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC)తో రానున్న మొదటి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఈ 10T మోడల్ ఫోన్ మొత్తం డిజైన్, 10Pro మాదిరిగానే ఉంది. మూడు సెన్సార్‌లతో పెద్ద కెమెరా మాడ్యూల్‌తో వస్తోంది. ఫ్రంట్ సైడ్.. సెల్ఫీ సెన్సార్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్ OISతో 50-MP Sony IMX766, 120-డిగ్రీ FOVతో 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో రానుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. స్మార్ట్‌ఫోన్ 16MP సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

OnePlus 10T launches today, India price expected to be under Rs 50,000

OnePlus 10T launches today, India price expected to be under Rs 50,000

OnePlus 10T 6.7 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో 2,412×1,080 పిక్సెల్‌ Full HD+ రిజల్యూషన్, 10-బిట్ కలర్స్, RGB కలర్ గామట్, HDR10+తో వస్తుంది. గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 10T 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ అందిస్తుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. OnePlus కూడా రాబోయే OnePlus 10T, 16GB RAMతో వస్తుందని ధృవీకరించింది. OnePlus ఫోన్‌కు మొదటిసారి 256GB ఇంటర్నల్ స్టోరేజీతో 10T ఫోన్ 150W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో వస్తుందని కంపెనీ వెల్లడించింది, రాబోయే OnePlus ఫోన్ 10Tలోనూ కంపెనీ OxygenOS 13గా నెక్స్ట్ జనరేషన్ OxygenOS అందించనుంది. 10T ఫోన్ OxygenOS 13 సపోర్టును అందిస్తుందా లేదా అనేది ఎలాంటి క్లారిటీ లేదు.

భారత్‌లో OnePlus 10T ధర (అంచనా) :
OnePlus 10T కొన్ని కీలక ఫీచర్లను రివీల్ చేయలేదు. OnePlus 10T భారత మార్కెట్లో ధర రూ. 49,999 నుంచి ఉంటుందని అంచనా. వన్ ప్లస్ 10T స్మార్ట్ ఫోన్ అధికారిక ధరను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది. సేల్ డేట్, బ్యాంక్ ఆఫర్లకు సంబంధించి లాంచ్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంది.

Read Also : OnePlus Nord Buds CE : వన్‌ప్లస్‌ నుంచి కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌.. 20 గంటల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?