OnePlus 11 Series : పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రెండు కొత్త వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ ఎప్పుడో తెలుసా?

OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (OnePlus) నుంచి రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. 2022 ఏడాదిలో OnePlus 10T చివరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. ఈ మధ్యన వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు రాలేదు.

OnePlus 11 Series : పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రెండు కొత్త వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ ఎప్పుడో తెలుసా?

OnePlus 11 with Snapdragon 8 Gen 2 SoC expected to arrive in December 2022

OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (OnePlus) నుంచి రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. 2022 ఏడాదిలో OnePlus 10T చివరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. ఈ మధ్యన వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు రాలేదు. ఇప్పుడు OnePlus 11 సిరీస్ లాంచ్ కానుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

చైనీస్ టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ సిరీస్ (OnePlus 11 Series) డిసెంబర్, 2022లో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. రాబోయే OnePlus 11 సిరీస్‌లో OnePlus 11, OnePlus 11 Pro వంటి రెండు ఫోన్‌లను లాంచ్ చేయనుంది. చైనా-ఆధారిత టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నివేదిక ప్రకారం.. OnePlus Qualcomm Snapdragon 8 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ పని చేస్తోందని నివేదిక వెల్లడించింది.

OnePlus 11 with Snapdragon 8 Gen 2 SoC expected to arrive in December 2022

OnePlus 11 with Snapdragon 8 Gen 2 SoC expected to arrive in December 2022

ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్లలో రన్ అయ్యే Qualcomm 8+ Gen 1 SoC కన్నా నెక్స్ట్ అప్‌గ్రేడ్ వెర్షన్. ఇప్పటివరకు ప్రాసెసర్‌కు సంబంధించిన వివరాలు మాత్రమే రివీల్ అయ్యాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. OnePlus రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్లలో లేటెస్ట్ లాంచ్ OnePlus 10T Pro స్మార్ట్ ఫోన్.. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ LTPO టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది. 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Display ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌ని కూడా అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూస్తే.. సెల్ఫీ కెమెరాలకు డిస్‌ప్లే కోసం పంచ్-హోల్ కటౌట్ కూడా అందించారు.

OnePlus 11 with Snapdragon 8 Gen 2 SoC expected to arrive in December 2022

OnePlus 11 with Snapdragon 8 Gen 2 SoC expected to arrive in December 2022

OnePlus 10T స్మార్ట్ ఫోన్ హీట్ కాకుండా ఉండేందుకు 3D కూలింగ్ సిస్టమ్‌తో వచ్చింది. హుడ్ కింద.. OnePlus 10T రిటైల్ బాక్స్‌లో 160W ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్టుతో 4,800mAh బ్యాటరీతో వచ్చింది. ఫోన్ బ్యాటరీని 19 నిమిషాల్లో 0 నుంచి 100 శాతానికి నింపుతుందని పేర్కొంది.  ఈ డివైజ్‌లో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) అలాగే నాయిస్ క్యాన్సిలేషన్‌ (Noise Cancellation)కు సపోర్ట్ ఉంది. కెమెరా విభాగంలో.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో OIS సపోర్టుతో 50-MP సోనీ IMX769 సెన్సార్ ఉంటుంది. 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో వచ్చింది. ఫ్రంట్ సైడ్ చూస్తే.. సెల్ఫీలను తీయడానికి 16-MP కెమెరా కూడా ఉంది.

భారత్‌లో OnePlus 10T ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో OnePlus 10T మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ డివైజ్ ధర రూ. 49,999 కాగా.. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. అలాగే 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 55,999గా నిర్ణయించింది. OnePlus స్మార్ట్‌ఫోన్‌లు 55,999 లో అందుబాటులో ఉన్నాయి. మూన్‌స్టోన్ బ్లాక్, జాడే గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి.

Read Also : OnePlus 10T First Sale : వన్‌ప్లస్ 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లో ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!