OnePlus TVలో కొత్త ఫీచర్ : ఫోన్ కాల్ వస్తే.. టీవీ volume ఆటో ఛేంజ్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి ఇండియాలో కొత్త Oneplus స్మార్ట్ టీవీ సెప్టెంబర్ 26న లాంచ్ కానుంది. వన్ ప్లస్ టీవీతోపాటు వన్ ప్లస్ 7T  స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ కానుంది.

  • Published By: sreehari ,Published On : September 23, 2019 / 09:02 AM IST
OnePlus TVలో కొత్త ఫీచర్ : ఫోన్ కాల్ వస్తే.. టీవీ volume ఆటో ఛేంజ్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి ఇండియాలో కొత్త Oneplus స్మార్ట్ టీవీ సెప్టెంబర్ 26న లాంచ్ కానుంది. వన్ ప్లస్ టీవీతోపాటు వన్ ప్లస్ 7T  స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ కానుంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి ఇండియాలో కొత్త Oneplus స్మార్ట్ టీవీ సెప్టెంబర్ 26న లాంచ్ కానుంది. వన్ ప్లస్ టీవీతోపాటు వన్ ప్లస్ 7T  స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ కానుంది. వన్ ప్లస్ టీవీ 55 అంగుళాల స్ర్కీన్ ఉంటుందని ఇప్పటికే కంపెనీ రివీల్ చేయగా.. ఇందులో కొత్త ఫీచర్ యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. ఇంట్లో వన్ ప్లస్ టీవీ చూస్తుండగా.. ఫోన్ కాల్ వస్తే.. ఆటోమాటిక్ గా టీవీ సౌండ్ తగ్గిపోతుంది.

సాధారణంగా ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ కాల్ వస్తే.. అందరూ టీవీ సౌండ్ మ్యూట్ చేస్తుంటారు. లేదా వాల్యూమ్ తగ్గిస్తారు. అదే వన్ ప్లస్ టీవీలో అయితే మనమే చేయక్కర్లేదు. యాప్ కంట్రోల్ ఆధారంగా ఫోన్ రింగ్ కాగానే ఆటోమాటిక్ గా టీవీ వాల్యూమ్ తగ్గిపోతుంది

స్మార్ట్ ఫోన్ తో వన్ ప్లస్ టీవీ యాప్ కనెక్ట్ అయి ఉంటే చాలు.. టీవీలో ఒక యాప్ నుంచి మరో యాప్ కు స్విచ్ అయ్యేలా యాక్సస్ చేసుకోవచ్చునని వన్ ప్లస్ సీఈఓ పీటె లౌ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కు కాల్ రాగానే.. వన్ ప్లస్ టీవీ సౌండ్ ఆటోమాటిక్ గా తగ్గుతుందని ఆయన అన్నారు. వన్ ప్లస్ టీవీ చూస్తున్న వారికి ఫోన్ కాల్ రాగానే ఈ ఫీచర్ ఆటో అలర్ట్ అవుతుందని చెప్పారు.

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కీప్యాడ్ సాయంతో వన్ ప్లస్ టీవీ స్ర్కీన్ పై టైప్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీ స్ర్కీన్ కీబోర్డుపై టైప్ చేయడం కంటే.. మొబైల్ కీబోర్డుపై టైప్ చేయడం ఎంతో సులభం. వన్ ప్లస్ టీవీకి సంబంధించి ఇతర ఫీచర్లను కంపెనీ ఇదివరకే ప్రకటించింది. క్వాంటమ్ డాట్ LED TV (QLED)డిస్ ప్లే ఉంటుంది.

LCD స్ర్కీన్ల మాదిరిగా ఫిక్సల్స్ రీలే వెనుక వైపున LED లైట్ ఉంటుంది. ఇందులో క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ తో పాటు 4K HDR సపోర్ట్ కూడా ఉంది. Dolby విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత వన్ ప్లస్ టీవీలో ఆండ్రాయిడ్ 9పై OS రన్ అవుతుంది. Dolby ఆట్మోస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది.