తగ్గుతున్న ఉల్లి ధరలు

  • Published By: chvmurthy ,Published On : December 9, 2019 / 02:11 PM IST
తగ్గుతున్న ఉల్లి ధరలు

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతుంటే కొన్నిరాష్ట్రాలు సబ్సిడీ ధరకు ఉల్లిని అందిస్తూ  ప్రజలకు  ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్‌, టర్కీల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఉల్లిని చూస్తుంటే వీటి ధరలు క్రమేపి తగ్గు ముఖం పడతాయనే సంకేతాలు అందుతున్నాయి. వీటికి తోడు దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కూడా  నిషేధం విధించటంతో దేశంలో ఉల్లి సరఫరా కూడా మెరుగు పడింది.

దేశ రాజధాని ఢిల్లీలోని అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్లో గత వారం ఉల్లి కిలో రూ. 65-80 మధ్య ఉండగా ఈ వారం అది రూ. 50-75 మధ్యకు చేరింది. ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీకి దేశీ ఉల్లితో పాటు విదేశాలనుంచి 200 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకోవటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

గత 2 రోజులుగా 80 ట్రక్కుల ఉల్లి ఆఫ్ఘనిస్తాన్, టర్కీల నుంచి చేరుకుందని మార్కెట్లోని వ్యాపారస్తులు తెలిపారు. పంజాబ్ లో పెద్ద ఎత్తున ఆఫ్ఘన్ ఉల్లిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు.