గూగుల్ టెస్టింగ్ ప్లాన్ : యూట్యూబ్ లో ‘షాపింగ్ లింక్స్’ ఫీచర్ 

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ యూట్యూబ్ ప్లాట్ ఫాంపై కొత్త షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ షాపింగ్ ఫీచర్ ను గూగుల్ టెస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : May 6, 2019 / 09:44 AM IST
గూగుల్ టెస్టింగ్ ప్లాన్ : యూట్యూబ్ లో ‘షాపింగ్ లింక్స్’ ఫీచర్ 

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ యూట్యూబ్ ప్లాట్ ఫాంపై కొత్త షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ షాపింగ్ ఫీచర్ ను గూగుల్ టెస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ యూట్యూబ్ ప్లాట్ ఫాంపై కొత్త షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ షాపింగ్ ఫీచర్ ను గూగుల్ టెస్టింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోల దిగువ భాగంలో షాపింగ్ ప్రొడక్ట్ లింక్ లను డిసిప్లే చేయనుంది. యూజర్లకు కొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తేనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. గూగుల్ ఎక్స్ ప్రెస్ మార్కెట్ ప్లేస్ ను ఇండియాలో ‘గూగుల్ షాపింగ్’ పేరుతో రీబ్రాండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

తద్వారా యూజర్లు నేరుగా గూగుల్ నుంచే తమకు నచ్చిన ప్రొడక్టులను కొనుగోలు చేసుకోనే అవకాశం ఉంటుంది. ఈ లింక్ ల ద్వారా ప్రొడక్ట్ ధర, ఇతరేతర వివరాలను సైట్ పై యూజర్లు వీక్షించవచ్చు. ప్రొడక్ట్ ధర, వివరాలను డిసిప్లే చేయడం ద్వారా యూజర్లు గూగుల్ నుంచి ఈజీగా లింక్ లపై క్లిక్ చేసి షాపింగ్ చేయవచ్చు. ప్రొడక్ట్ రికమండేషన్స్ పై క్లిక్ చేస్తే వివరాలను చెక్ చేసుకోనే వీలుంది. షాపింగ్ బిజినెస్ లో ప్రధానంగా గూగుల్ టెక్స్ట్, ఇమేజ్ సెర్చ్, యూట్యూబ్ వీడియో వంటి షాపింగ్ లింక్ లను డిసిప్లే చేయనుంది. యూట్యూబ్ లో ఏదైనా ప్రొడక్ట్ వీడియోలు డిసిప్లే అయితే.. యూట్యూబ్ ఆప్షన్లపై ప్రొడక్ట్ బ్రాండ్ కు సంబంధించిన రికమండేషన్స్ కనిపిస్తాయి.  

ఇప్పటికే ఆన్ లైన్ షాపింగ్ లో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ అమెరికాలో షాపింగ్ బిజినెస్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆన్ లైన్ అడ్వర్టైజింగ్ బిజినెస్ లో భారీగా ప్రాఫిట్ గెయిన్ చేస్తోంది. అడ్వర్టైజింగ్ బిజినెస్ లో వెనుకబడిన గూగుల్.. షాపింగ్ ఫీచర్ ప్రొడక్ట్ తో మళ్లీ షాపింగ్ బిజినెస్ రీగ్రోత్ పై దృష్టి పెట్టింది.

ఇప్పటివరకూ గూగుల్ షాపింగ్ ట్యాబ్ ద్వారా యూజర్లు యూట్యూబ్ లో వీడియోలపై లింక్ లు క్లిక్ చేస్తే.. ప్రొడక్ట్ సెల్లర్ల సైట్ల నుంచి ప్రొడక్ట్ లను బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ షాపింగ్ ఫీచర్ ద్వారా.. యూజర్లు ప్రొడక్ట్ వెబ్ సైట్ కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్ వీడియోల కింద డిసిప్లే అయ్యే షాపింగ్ లింక్ లపై యూజర్లు క్లిక్ చేసినప్పుడు.. అది నేరుగా గూగుల్ ఎక్స్ ప్రెస్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.  గూగుల్ కార్ట్ పేజీ నుంచే యూజర్లు నేరుగా షాపింగ్ చేయవచ్చు.