130కోట్ల మందిలో రూ.కోటిపైన ఆదాయాన్ని ప్రకటించింది 2వేల మంది మాత్రమే!

10TV Telugu News

2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,200 మంది నిపుణులు మాత్రమే వార్షిక ఆదాయాన్ని రూ. 1 కోటికి పైగా ప్రకటించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫిబ్రవరి 12 న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించినట్టు ఫిబ్రవరి 13న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) పునరుద్ఘాటించింది. దేశంలో కేవలం 2,200 మంది మాత్రమే సంవత్సరానికి ఒక కోటి రూపాయల ఆదాయాన్ని ప్రకటించారనేది నమ్మశక్యం కాని నిజం అని ప్రధాని మోడీ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎందుకంటే ఈ సంఖ్య తప్పు అంటూ నెటిజన్లు విమర్శించారు. దీనిపై స్పందించిన CBDT ట్విట్టర్ వేదికగా వరుసగా ట్వీట్లు చేసింది.

2019 ఆర్థిక సంవత్సరం (FY19)లో 5.78 కోట్ల మంది ఆదాయ-పన్ను రిటర్నులను దాఖలు చేసినట్లు CBDT వివరించింది. వీరిలో కేవలం 1.46 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు దాఖలు చేసిన ITRలో, కేవలం 2,200 మంది వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, ఇతర నిపుణులు మాత్రమే తమ వృత్తి నుండి ఆర్జించిన రూ .1 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని వెల్లడించారు.

(అద్దె, వడ్డీ, మూలధన లాభాలు వంటి ఇతర ఆదాయాలను మినహాయించి) ’రూ. 3.16 లక్షల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .50 లక్షలకు పైగా ఆదాయాన్ని వెల్లడించారని, 8,600 మంది దేశవ్యాప్తంగా రూ.5 కోట్ల ఆదాయాన్ని వెల్లడించారని CBDT గుర్తించింది. ‘గత ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. మూడు కోట్లకు పైగా భారతీయులు పనిమీద లేదా ప్రయాణం కోసం విదేశాలకు వెళ్లారు.

మన దేశంలో ఒకటిన్నర కోట్ల మంది మాత్రమే 130 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించండి’ అని టైమ్స్ నౌ సమ్మిట్‌లో మోడీ అన్నారు. చాలా మంది ప్రజలు పన్ను చెల్లించనప్పుడు దానిని తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటే… వారి బకాయిలను నిజాయితీగా చెల్లించే వారిపై ఈ భారం పడుతుందన్నారు.అందుకే ఫేస్ లేస్ ట్యాక్స్ అసిస్ మెంట్ సిస్టమ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మోడీ చెప్పారు.

దీని అర్థం పన్నును అంచనా వేసేవారికి ఎవరి పన్ను లెక్క కడుతున్నారో తెలియదని, ఎవరి పన్నును అంచనా వేస్తున్నారో అది ఏ అధికారి చేస్తున్నారో కూడా తెలుసుకోలేరని ఆయన అన్నారు. తమ విలువైన జీవితాలను దేశానికి అంకితం చేసిన వారిని స్మరించుకుంటూ.. తమ పన్నులను నిజాయితీగా చెల్లిస్తారని ప్రతిజ్ఞ చేయమని దేశప్రజలందరిని కోరుతున్నాను” అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.