అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్

ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.

  • Published By: chvmurthy ,Published On : March 6, 2019 / 10:41 AM IST
అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్

ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.

అమరావతి:  ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. సుమారు 1704 ఫ్లాట్ల నిర్మాణానికి  ప్రణాళికలు రూపోందిస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వినియోగదారులకు సొంతింటి కలను సాకారం చేసే పనిలో సీఆర్డీఏ నిమగ్నమైంది. 2018 నవంబర్ 9వ తేదీన 300 ప్లాట్లకు, డిసెంబర్ 10న 900 ప్లాట్లకుగాను విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో తొలుత ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభించారు. రెండు విడతల్లోనూ ప్లాట్లు బుకింగ్ చేసుకునేందుకు వినియోగదారులు పోటీపడ్డారు. హ్యాపీనెస్ట్-1 ప్రాజెక్ట్ లో మొత్తం 1200 ప్లాట్ల వరకు నిర్మాణాలు జరగాల్సి ఉంది. 
Also Read : విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

వినియోగదారుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని తాజాగా హ్యాపీనెస్ట్-2ను ఐనవోలు సమీపంలో 16.05 ఎకరాల్లో 1704 ప్లాట్లు నిర్మించాలని సీఆర్డీఏ  సంకల్పించిందని కమీషనర్ శ్రీధర్ చెప్పారు. మొత్తం 12 అపార్ట్ మెంట్ బ్లాక్ లు ఇందులో ఉంటాయి. రూ.1150 కోట్లతో 23 అంతస్తులుగా నిర్మాణాన్ని చేపడతారు. 1290, 1590, 1890, 2190 చదరపు అడుగులు విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల్లో ప్లాట్లు అందుబాటులోకి తెస్తారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. నివాస సముదాయం హ్యాపీనెస్ట్-2కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ ప్రక్రియ మార్చి  నెలలో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.     
 Also Read : రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి