OYO CEO Ritesh Agarwal : ఓ కస్టమర్ నాకు రూ. 20 టిప్ ఇచ్చాడు : OYO CEO రితేష్ అగర్వాల్

హాస్పిటాలిటీలో నిజమైన స్టార్స్ ఆఫీసు మనేజనర్లు,క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్టులు ఇంకా దీంట్లో తెరవెనుక ఎంతోమంది కృషి ఉంటుంది అని రితేశ్ తెలిపారు.

OYO CEO Ritesh Agarwal : సాధారణంగా హోటల్ కు వెళ్లి రూమ్ ఖాళీ చేసే సమయంలో సర్వీస్ చేసేవాళ్లకు టిప్పులిస్తుంటారు. కానీ ఓ కస్టమర్ ఏకంగా సీఈవోకే టిప్ ఇచ్చాడు. ఈ టిప్ అందుకున్నది ఎవరో కాదు OYO CEO రితేష్ అగర్వాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు రితేష్ అగర్వాల్. తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని ఇంటర్వ్యూలో తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో తను పడిన ఇబ్బందుల్ని, ఎదురైన అనుభవాలను ఇంటర్వ్యూలో చెబుతు ఓయో రూమ్ (OYO Room) కంపెనీకి బాస్ రితేశ్ గా మాత్రమే కాకుండా ఫ్రంట్ డెస్క్ మేనేజర్ గా అసవరమైనప్పుడు క్లీనింగ్ స్టాఫ్ గా కూడా పనిచేశానని తెలిపారు.

అలా తాను ఓ రోజు రూమ్ క్లీన్ చేస్తుంటే కస్టమర్ తనకు రూ.20 లు టిప్ ఇచ్చాడని తెలిపారు. దాంతో నేను సీఈవోని అని ఏమాత్రం రితేష్ ఫీల్ అవ్వలేదు. కష్టమర్ ఇచ్చిన ఆ రూ.20ల టిప్ ను అందుకున్నానని తెలిపారు. ఆ సందర్భాన్ని రితేష్ గుర్తు చేసుకుంటు ఓ రోజు రూమ్ క్లీనింగ్ లేట్ అయ్యింది.దానికి కష్టమర్ కోపం వ్యక్తంచేశాడు. స్టాఫ్ ని చెడామడా తిట్టేస్తున్నాడు. దీంతో తాను అతనికి సర్ధి చెప్పటానికి వెళగా తాను కూడా స్టాప్ అనుకుని క్లీనింగ్ బాయ్ ని అనుకుని తనను కూడా చెడామడా తిట్టేశాడని..అయినా తాను రూమ్ ను క్లీన్ చేయగా అతని కోపం చల్లారింది. తరువాత తనను మెచ్చుకుని రూ.20లు టిప్ ఇచ్చాడని తెలిపారు.

రితేశ్ అగర్వాలు తన 19 ఏళ్ల వయస్సులో కాలేజీ మానేశారు. అదే అతని జీవింతంలో గొప్ప మలుపు అయ్యింది. బిలియనీర్ పీటర్ థీమ్ స్థాపించిన ప్రతిష్టాత్మక థీల్ ఫెలోషిప్ కు అర్హత సాధించేలా చేసింది. అలా OYO Room అనే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అలా తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.కానీ ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. ఈ సంస్థకు సీఈవో అయినా రూమ్ క్లీనర్ గా కూడా పనిచేసేవారు.

ఈ ఇంటర్వ్యూలో రితేశ్ హాస్పిటాలిటీ రంగంలో హౌస్ కీపింగ్, డెస్క్ మేనేజర్ వంటి సిబ్బంది పాత్ర గురించి ఆ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. హాస్పిటాలిటీలో నిజమైన స్టార్స్ ఆఫీసు మనేజనర్లు,క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్టులు ఇంకా దీంట్లో తెరవెనుక ఎంతోమంది కృషి ఉంటుందని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన కెరీర్ ప్రారంభంలో తనకు రూ.20లు టిప్ ఇచ్చాడని ఇంటర్వ్యూలో తెలిపారు.

రితేశ్ అగర్వాల్ ఒడిశాలోని ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబానికి దక్షిణ ఒడిశాలో రాయగడలో ఓ చిన్న షాపు నిర్వహించేవారు. రితేశ్ ఓ పక్క చదువుకుంటునే మరోపక్క 13ఏళ్లలోనే సిమ్ కార్డులు అమ్మేవారు. అలా ఓ విభిన్నమైనది చేయాలనే ఆలోచనతో 2013లో OYO రూమ్‌లుగా ప్రారంభించారు.అలా అతని కష్టంతో కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ గా పేరొందారు.

ట్రెండింగ్ వార్తలు