Pan - Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి | PAN - Aadhaar mandatory for transactions of ₹20 lakh or more, From tomorrow

Pan – Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి

క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ ప్రక్రియల్లో రేపటి నుంచి ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మే26న సిటిజన్లు డ్రా చేసే సమయంలో కచ్చితంగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒకే ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.20లక్షలు అకౌంట్‌లో డిపాజిట్/ విత్‌డ్రా చేయడానికి పాన్ లేదా ఆధార్ కావాల్సిందే.

Pan – Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి

Pan – Aadhaar: క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ ప్రక్రియల్లో రేపటి నుంచి ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గురువారం మే26న సిటిజన్లు డ్రా చేసే సమయంలో కచ్చితంగా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒకే ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.20లక్షలు అకౌంట్‌లో డిపాజిట్/ విత్‌డ్రా చేయడానికి పాన్ లేదా ఆధార్ కావాల్సిందే.

కొత్త గైడ్‌లెన్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మే 10న నోటిఫికేషన్‌లో ప్రకటించింది.

“టర్మ్ లావాదేవీలలో ఒకే ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా డిపాజిట్ చేయడం/విత్‌డ్రా చేయడం కూడా ఇందులోకే వస్తుంది. కేవలం వాణిజ్య బ్యాంకులలోని అకౌంట్లే కాదు, కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు అకౌంట్లు కూడా ఇందులోకి వస్తాయి” అని నోటిఫికేషన్ విడుదల చేశారు.

Read Also : పాన్ ఉండాల్సిందే.. రూ.20 ల‌క్ష‌ల డిపాజిట్, విత్‌డ్రాకు కొత్త రూల్స్‌..!

బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఉన్న వ్యక్తి కరెంట్ బ్యాంక్ అకౌంట్ లేదా నగదు క్రెడిట్ ఖాతాను తెరిచే వాళ్లకు కూడా లేటెస్ట్ గైడ్ లైన్స్ వర్తిస్తుంది.

అదే సమయంలో, వ్యక్తి యొక్క డెమోగ్రాఫిక్ లేదా బయోగ్రాఫిక్ సమాచారంతో పాన్ లేదా ఆధార్‌ను ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (సిస్టమ్స్) లేదా ఇన్‌కమ్ టాక్స్ (సిస్టమ్స్) డైరెక్టర్ జనరల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్, లేదా డైరెక్టర్ జనరల్, లేదా ఎవరి ద్వారా అధికారం పొందిన అధికారి, పాన్ లేదా ఆధార్ ప్రమాణీకరణ ప్రక్రియతో ఆథంటిఫికేషన్ ఇస్తారు.

×