Paytm Outage : స్తంభించిన పేటీఎం సేవలు.. యాప్, వెబ్‌సైట్ డౌన్.. నిలిచిపోయిన పేమెంట్లతో యూజర్లలో టెన్షన్.. అసలేమైందంటే?
Paytm Outage : ప్రముఖ భారతీయ డిజిటల్ పేమెంట్ దిగ్గజం (Paytm) పేమెంట్ సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో యాప్ సేవలు మాత్రమే కాదు.. Paytm అధికారిక వెబ్‌సైట్ కూడా డౌన్ అయింది.

Paytm Outage : ప్రముఖ భారతీయ డిజిటల్ పేమెంట్ దిగ్గజం (Paytm) పేమెంట్ సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. స్మార్ట్ ఫోన్లలో యాప్ సేవలు మాత్రమే కాదు.. Paytm అధికారిక వెబ్‌సైట్ కూడా డౌన్ అయింది. అప్పటివరకూ పేమెంట్ ద్వారా పేమెంట్లు చేసిన యూజర్ల డబ్బులు తమ అకౌంట్లో క్రెడిట్ కాలేదు. దాంతో తమ డబ్బులు ఏమయ్యాయో తెలియక యూజర్లలో గందరగోళం నెలకొంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసులు (Paytm Payments Services) పనిచేయడం లేదని, బాధిత యూజర్లు Paytm యాప్, వెబ్‌సైట్‌కి Login కాలేకపోతున్నామని నివేదించారు.
పేమెంట్స్ చేయలేకపోయామని ట్విట్టర్ వేదికగా తమ సమస్యను నివేదించారు. కొంతమంది పేటీఎం యూజర్లు పేమెంట్స్ చేయడానికి ప్రయత్నించగా.. ఆటోమాటిక్‌గా Account Logout అయిపోతుందని, తిరిగి లాగిన్ చేయలేకోపోతున్నామని Paytm అధికారిక ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే యూజర్ల ఫిర్యాదుతో స్పందించిన Paytm ఇప్పుడు సమస్యను పరిష్కరించింది. పేటీఎం యూజర్లు ఎప్పటిలానే తమ లాగిన్ డేటాను ఉపయోగించి సులభంగా లాగిన్ చేయవచ్చు.

Paytm Outage Paytm briefly goes down for many users, app and website affected
మరోవైపు.. Paytm సంస్థ తమ ప్లాట్ ఫాంపై లావాదేవీలు తగ్గిపోయాయని ధృవీకరించింది. పేమెంట్లు చేసేందుకు ప్రయత్నించిన యూజర్లను నేరుగా లాగిన్ స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతుందని తెలిపింది. అయితే మళ్లీ యూజర్లు తమ లాగిన్ వివరాలను (credentials) ఎంటర్ చేసినా తీసుకోవడం లేదు. ప్రతి పేటీఎం యూజర్‌కు ‘Something went wrong, please try again after some time’ error అనే ఎర్రర్ మెసేజ్ డిస్ ప్లే అవుతోంది.

Paytm Outage Paytm briefly goes down for many users, app and website affected
దాంతో పీటీఎం యూజర్లు ఈ ఎర్రర్ స్ర్కీన్ షాట్ తీసి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పేటీఎం యూజర్లు Paytmతో సమస్యలను ఎదుర్కొంటున్నారని అవుట్‌టేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ DownDetector కూడా ధృవీకరించింది. దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని పేటీఎం యూజర్లు ఎక్కువగా ఈ ఔటేజ్ సమస్యలను ఎదుర్కొన్నారు.
పేటీఎం యాప్‌లో ‘Network Error’ పరిష్కరించాం..
Due to a network error across Paytm, a few of you might be facing an issue in logging into the Paytm Money App/website. We are already working on fixing the issue at the earliest. We will update you as soon as it is resolved
— Paytm Money (@PaytmMoney) August 5, 2022
Paytm అధికారికంగా ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. పేటీఎం యాప్‌లో ‘Network Error ‘ ఉందని ధృవీకరించింది. ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికి తమ బృందం పని చేస్తోందని పేర్కొంది. Paytm యాప్‌కి సంబంధించిన నెట్‌వర్క్ లోపం ఇప్పుడు పరిష్కరించినట్టు వెల్లడించింది. పేటీఎం వినియోగదారులు తమ సర్వీసుల్లో లాగిన్ చేసి ఎప్పటిలానే లావాదేవీలు చేయవచ్చు లేదా Paytm ఇతర ఫీచర్‌లను ఉపయోగించవచ్చునని పేర్కొంది.
Read Also :Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఎందుకంటే?