Pepsi.. 2 లీటర్ల కొత్త బాటిల్ వచ్చేసింది.. గ్రిప్ పాయింట్ సూపర్బ్!

  • Published By: sreehari ,Published On : November 17, 2020 / 07:09 AM IST
Pepsi.. 2 లీటర్ల కొత్త బాటిల్ వచ్చేసింది.. గ్రిప్ పాయింట్ సూపర్బ్!

Pepsi unveils first 2-liter bottle redesign : ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీకో (PEP) రెండు లీటర్ల బాటిల్ ఆవిష్కరించింది. మూడు దశాబ్దాల కాలంలో (30ఏళ్లలో) తొలిసారి రెండు లీటర్లతో ఒకే మాదిరిగా రీడిజైన్ చేసి మరి మార్కెట్లోకి వదిలింది.. ఈ వారం నుంచే పెప్సీ 2 లీటర్ల బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి.



పాత బాటిల్ కంటే రీడిజైన్ బాటిల్ 25శాతం ఒకేలా ఉన్నప్పటికీ గ్రిప్ పాయింట్ మాత్రం కాస్తా ట్రెండీగా డిజైన్ చేసింది. ఇప్పటికే అమెరికాలోని కొన్ని స్టోర్టలో ఈ రీడిజైన్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చేశాయి.

మోడ్రాన్ ఫంక్షనల్ డిజైన్ తో సులభంగా వాడేందుకు వీలుగా రెండు లీటర్ల బాటిళ్లను రూపొందించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Pepsi unveils first 2-liter bottle redesignPepsiCo (PEP) ముందుగా రెండు లీటర్ల బాటిళ్లను రెండు డజన్లకు పైగా మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది.
https://10tv.in/us-hiker-brought-back-to-life-after-his-heart-stopped-for-45-minutes/
పెప్సీ బ్రాండ్ మోడళ్లలో MTN DEW (née Mountain Dew), Crush, Dr. Pepper, Schweppes Ginger Ale వంటి ఆప్షన్లతో రిలీజ్ చేస్తోంది.



చికాగోలో పలు సాఫ్ట్ డ్రింక్ షాపుల్లో ఈ మోడల్ పెప్సీ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పెప్సీ కొత్త బాటిళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. పెప్సీ రెండు లీటర్ల బాటిల్ చేతుల్లో పట్టుకోవడానికి వీలుగా గ్రిప్ పాయింట్‌తో రీడిజైన్ చేసింది కంపెనీ.



సాధారణంగా పెప్సీ బాటిల్ పరిమాణం సగటున 7 అంగుళాల నుంచి 8.6 అంగుళాల వరకు ఉంటుందని పెప్సీకో రీసెర్చ్ తెలిపింది. పాత 2 లీటర్ బాటిల్ సైజు 13.4 అంగుళాలతో పోలిస్తే ఈ కొత్త బాటిల్ మాత్రం గ్రిప్ తో కలిపి 10.4 అంగుళాల పరిమాణం ఉంటుంది.

అంతేకాదు.. ఈ కొత్త బాటిల్ ను 100శాతం రీసైకిల్ చేసుకోవడంతో పాటు వచ్చే ఐదేళ్లలో భూమిలో ఎరువుగా మారేలా ప్లాస్టిక్‌తో రీడిజైన్ చేసింది కంపెనీ.