దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

  • Published By: Subhan ,Published On : June 8, 2020 / 03:22 AM IST
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

పెట్రలో, డీజిల్ ధరలు ఆదివారం 60పైసలు పెరిగాయి. ఫలితంగా ఢిల్లీలో పెట్రోల్ రూ.71.86కు చేరింది. స్టేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ధరల నోటిఫికేషన్ ఆధారంగా డీజిల్ ధర రూ.69.99గా ఉంది. ఓ ఆయిల్ కంపెనీ అధికారి మాట్లాడుతూ డైలీ ధర మార్పును తిరిగి మొదలుపెట్టామన్నారు. 

ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్(ATF), LPGధరలు పెరుగుతున్నా.. మార్చి 16నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను అలానే ఉంచారు. ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి ధర మారుతుంది. గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.3కు పెంచింది. ఈ కారణంగా ఇంటర్నేషనల్ రేట్ల కంటే తగ్గదని అభిప్రాయం.

మే6న మరోసారి ఎక్సైజ్ డ్యూటీలను పెట్రలోపై లీటరుకు రూ.10చొప్పున, డీజిల్ పై రూ.13చొప్పున పెంచింది. కోల్‌కతా, ముంబైలలో పెట్రోల్ ధర 59పైసలు పెరిగి రూ.73.89, రూ.78.91కు చేరాయి. చెన్నైలోనూ 53పైసలు పెరిగి రూ.76.07కు చేరింది. 

డీజిల్ ధర ముంబైలో 58పైసలు పెరిగి రూ.68.79కి చేరింది. కోల్‌కతాలో 55 పైసలు పెరిగి రూ. 66.17కు చేరింది. చెన్నైలో రూ. 68.22 నుంచి రూ. 68.74 పెరిగింది.

Read: జియో మరో బంపర్ ఆఫర్, ఏడాది పాటు ఫ్రీ