ఆ రాష్ట్రంలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఒకే ధర.. డీజిల్ ఖరీదు కావడానికి కారణం ఇదే

గత రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటి ధర లీటర్ కు

ఆ రాష్ట్రంలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఒకే ధర.. డీజిల్ ఖరీదు కావడానికి కారణం ఇదే

గత రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటి ధర లీటర్ కు

గత రెండు వారాలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీటి ధర లీటర్ కు ఏకంగా రూ.10 వరకు పెరిగింది. అయితే ఎక్కడైనా డీజిల్ ధర కన్నా పెట్రోల్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇది కామన్. కానీ చరిత్రలో ఫస్ట్ టైమ్ దీనికి భిన్నమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సుమారు ఒకే ధర పలుకుతున్నాయి.

లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.76.. డీజిల్‌ ధర రూ.79.40:
వరుసగా 17వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో మంగళవారం(జూన్ 23,2020) దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సుమారు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.76 కాగా, డీజిల్‌ ధర రూ.79.40గా ఉంది. లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌పై 20 పైసలు, డీజిల్‌‌పై 55 పైసలను మంగళవారం(జూన్ 23,2020) ఆయిల్‌‌ కంపెనీలు పెంచాయి. దీంతో డీజిల్‌‌ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌ రూ. 79.76 కు, డీజిల్‌‌ రూ. 79.40 కు చేరాయి. అంటే వీటి మధ్య తేడా కేవలం 36 పైసలు మాత్రమే.

ఢిల్లీలో డీజిల్ ఖరీదు కావడానికి కారణం ఇదే:
ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌ మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా డీజిల్ ధర పెట్రోల్‌‌ ధర కంటే తక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌‌పై వ్యాట్‌‌ను భారీగా పెంచడంతో పెట్రోల్‌‌ కంటే డీజిల్ ఖరీదుగా మారింది. మే నెల ప్రారంభంలో ఢిల్లీ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధర మధ్య రూ. 7.30 లు గ్యాప్‌‌ ఉండేది. కానీ వీటిపై వ్యాట్‌‌లను పెంచడంతో ధరల్లో మార్పులొచ్చాయి. కేజ్రివాల్‌‌ ప్రభుత్వం లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌పై వ్యాట్‌‌ను 27 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌‌పై 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచింది.

17 రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు:
వీటికి తోడు గత 17 రోజుల నుంచి పెట్రోల్‌‌, డీజిల్‌‌పై ధరలను ఆయిల్‌‌ కంపెనీలు పెంచుతూనే ఉన్నాయి. ఈ 17 రోజుల్లో లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌ పై రూ. 8.50 లు, డీజిల్‌‌ పై రూ. 10.01 లు పెరిగాయి. మిగిలిన సిటీలలో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ధరల మధ్య కాస్త వ్యతాసం ఉంది. హైదరాబాద్‌‌లో లీటర్‌‌‌‌ పెట్రోల్‌‌ ధర రూ.82.79గా, డీజిల్‌‌ ధర 77.60 గా ఉంది. వీటి మధ్య రూ. 5.19 లు గ్యాప్‌‌ ఉంది. ఢిల్లీలో పరిస్థితి ఇలా ఉన్నా ఇతర మెట్రో నగరాలైన కోల్‌కత్తా, ముంబై, చెన్నైలలో డీజిల్‌ రేట్ల కంటే పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి.

అమరావతిలో పెట్రోల్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.83.15 దగ్గరే కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.77.93 దగ్గర నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.82.75 దగ్గర స్థిరంగా కొసాగుతోంది. డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. రూ.77.56 దగ్గర స్థిరంగా ఉంది. గత 18 రోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read: ATMలో విత్ డ్రా ఛార్జీల పెంపు ?