Petrol Diesel Rates Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

వాహనదారులకు గుడ్ న్యూస్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Petrol Diesel Rates Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

petrol diesel rates down

petrol diesel rates down : వాహనదారులకు గుడ్ న్యూస్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ రూ.97.8, ఏపీలో లీటర్ పెట్రోల్ రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది.

దాదాపు 6 నెలల తరువాత ధరలు తగ్గడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ. 2 వరకు తగ్గే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. అయితే ఈ తగ్గింపు క్రమంగా జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

గత కొంతకాలంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న చివరిసారిగా ధర తగ్గింది. మళ్లీ దాదాపు ఏడు నెలల తరువాత పెట్రోల్, డీజిల్ తగ్గడంతో వాహనదారులకు కాస్తా ఊరట కలిగింది. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో సంతోష పడుతున్నారు. దీపావళి పండుగల సీజన్‌తో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో అక్టోబర్ 15వ తేదీ వరకు దేశంలో ఇంధన విక్రయాలు పెరిగాయి.

పెట్రోలు, డీజిల్ అమ్మకాలు గతేడాది కంటే 22-26 శాతం పెరిగాయి. అక్టోబర్ 2020 మొదటి అర్ధభాగంతో పోలిస్తే ఇప్పుడు 31 శాతం ఎక్కువ పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య కాలంలో పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అదే సమయంలో గతేడాది 1.05 మిలియన్ టన్నులు పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.