వాహ‌న‌దారుల‌కు షాక్‌..పెట్రోల్ ధ‌రలు ఎంత పెరిగాయో తెలుసా

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 03:59 AM IST
వాహ‌న‌దారుల‌కు షాక్‌..పెట్రోల్ ధ‌రలు ఎంత పెరిగాయో తెలుసా

క‌రోనా వేళ వాహ‌న‌దారుల‌కు షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. బండి బ‌య‌ట‌కు తీయాలంటే..ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. పెట్రోల్ రేట్లు భ‌గ్గుమంటుండ‌డంతో వాహ‌న‌దారులు బెంబేలెత్తిపోతున్నారు. వ‌రుస‌గా కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

పెరుగుద‌ల‌ను న‌మోదు చేస్తూ..గ‌రిష్ట స్థాయికి చేరాయి. 2020, జూన్ 17వ తేదీ బుధ‌వారం కూడా చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. పెట్రోల్ పై 55 పైస‌లు, డీజిల్ పై 60 పైస‌లు పెంచుతూ ప్ర‌భుత్వ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. 

దీంతో గ‌డిచిన 11 రోజుల్లో ఏకంగా పెట్రోల్ పై రూ. 6, డీజిల్ రూ. 6.40 వ‌ర‌కు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో వాహ‌న‌దారులు వెహిక‌ల్ తీయాలంటే..భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిందంటున్నారు. 

తాజా ధ‌ర‌ల‌తో తెలుగు రాష్ట్రాల్ల్లో పెట్రోల్ ధ‌ర రూ. 80.22కు చేర‌గా..డీజిల్ ధ‌ర‌లు రూ. 74.07కు చేరింది. రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర రూ. 77.28, డీజిల్ రూ. 75.79. చెన్నైలో పెట్రోల్ ధ‌ర రూ. 80.86, డీజిల్ రూ. 73.69, ముంబైలో పెట్రోల్ ధ‌ర రూ. 84.15, డీజిల్ రూ. 74.32, ఏపీలో పెట్రోల్ ధ‌ర రూ. 80.66, డీజిల్ ధ‌ర రూ. 74.54, హైద‌రాబాద్ లో పెట్రోల్ ధ‌ర రూ. 80.22, డీజిల్ ధ‌ర రూ. 74.07 పెరిగాయి. దీంతో వాహ‌న‌దారుల జేబుకు చిల్లు ప‌డుతోంది. 

Read: పెరిగిన పెట్రోల్ ధరలు..ఎంతంటే!