బాదుడే బాదుడు : వరుసగా 13వ రోజు పెట్రో ధరల పెంపు

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 03:17 AM IST
బాదుడే బాదుడు : వరుసగా 13వ రోజు పెట్రో ధరల పెంపు

బాదుడే బాదుడు..ఓ వైపు కరోనా విస్తరిస్తూ..ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే..చమురు మాత్రం..మాకేంటీ..అంటోంది. వ్యాపారాలు సరిగ్గా జరగక, పనులు దొరక్క, ఆదాయ పూర్తిగా తగ్గిపోయి..జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో పుండుమీద కారం చల్లినట్లు చమురు ధరలు పెరుగుతుడడం సర్వత్రా ఆందోళనలు నెలకొంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు అధికమౌతూనే ఉన్నాయి.

ముడి చమురు ధరలు  :- 
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు బాగా తక్కువగానే ఉన్నా…భారతదేశంలో ధరలు తగ్గకపోగా…పై పైకి ఎగబాకుతున్నాయి. గత 13వ రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  2020, జూన్ 18వ తేదీ గురువారం రోజు..పెట్రోల్ లీటర్ ధర రూ. 80.77, డీజిల్ ధర రూ. 74.70గా ఉంది. 2020, జూన్ 19వ తేదీ శుక్రవారం పెట్రోల్ పై 55 పైసలు, డీజిల్ పై 63 పైసలు చొప్పున ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 81.36, డీజిల్ రూ. 75.31గా ఉంది. 

పన్నులు, సెస్ ల రూపంలో : –
ఇక్కడో విషయం చెప్పుకోవాలి..ప్రజలకు నొప్పి తెలియకుండా…రోజుకు 40 పైసలు, 50 పైసలు, 60 పైసలు పెంచుతున్నాయి చమురు
కంపెనీలు. అంతేగాకుండా..పన్నులు, సెస్ ల రూపంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. కరోనా వైరస్ కారణంగా…రెండు నెలలుగా లాక్ డౌన్ వల్ల పెద్దగా డిమాండ్ లేకపోవడంతో…ప్రతి రోజు ధరలు సవరించే పద్ధతిని తాత్కాలికంగా అటకెక్కించాయి.

పెట్రోల్, డీజిల్ లకు డిమాండ్ : –
ప్రస్తుతం ఆంక్షలు సడలించిన తర్వాత..పెట్రోల్, డీజిల్ లకు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. నష్టాలను పూడ్చుకొనేందుకు ఇదే సరైన సమయమని భావంచి..రోజు..ధరలు పెంచేస్తున్నాయి. ఏప్రిల్ నెలాఖరు నుంచి నెమ్మదిగా ధరలు కోలుకున్నాయి. చమురు ధర 60 డాలర్లకు మించే అవకాశం లేదని…అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారని తెలుస్తోంది. దీని ప్రకారం..చూస్తే..భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో తక్కువగా ఉండాలి..కానీ..పన్నుల భారం అధికంగా ఉండడం వల్ల..ముడి చమురు ధర తగ్గిన మేరకు రిటైల్ ధరలు తగ్గడం లేదు. 

ప్రధాన నగరాల్లో ధరలు
న్యూఢిల్లీ : పెట్రోలు రూ. 78.37,  డీజిల్ రూ.77.06
ముంబై : పెట్రోలు రూ. 85.21, డీజిల్  రూ.75.53
చెన్నై: పెట్రోలు ధరూ. 81.82,  డీజిల్  రూ.74.77
హైదరాబాద్ : పెట్రోలు  రూ. 81.36,  డీజిల్ రూ.75.31
అమరావతి : పెట్రోలు  రూ. 81.76,  డీజిల్ రూ.75.73

Read: త్వరలో విమానాల్లో డబుల్ డెక్కర్ సీట్లు.. ఇక లిమిటెడ్ లెగ్ రూమ్‌లు ఉండవు!