వాహనదారులకు షాక్ : పెట్రోల్ ధర పెరిగింది

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 06:33 AM IST
వాహనదారులకు షాక్ : పెట్రోల్ ధర పెరిగింది

వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోలు ధరలు పెరిగాయి. పలు మెట్రో నగరాల్లో గురువారం(నవంబర్ 14,2019) పెట్రోల్‌ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. డీజిల్‌ ధరల్లో మాత్రం మార్పు లేదు.

గత 10 రోజుల్లో పెట్రోల్ ధర 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్‌కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచారు. డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది.

బ్రెంట్‌ ఫూచర్స్‌ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం(నవంబర్ 13,2019) 2 నెలల కనిష్ట స్థాయి 72.09 దగ్గర ముగిసింది. 

మెట్రో నగరాలు పెట్రోల్(లీటర్ ధర) డీజిల్(లీటర్ ధర)
హైదరాబాద్‌ రూ. 78.16 రూ.71.80
విజయవాడ రూ. 77.40 రూ.70.76
ఢిల్లీ రూ. 73.45 రూ.65.79 
కోల్ కతా రూ. 76.15 రూ.68.2
చెన్నై రూ.76.34 రూ.69.54
ముంబై రూ. 79.12 రూ.69.01

 

ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను రోజువారీగా సమీక్షిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో మార్పులు చేస్తున్నాయి. డిమాండ్, సప్లయ్ కి అనుగుణంగా ధరలను మారుస్తున్నాయి. అయితే పెంచే సమయంలో భారీగా ధర పెంచుతున్న ఆయిల్ కంపెనీలు.. తగ్గింపు విషయంలో మాత్రం కేవలం పైసల్లో ఉంటోంది. దీనిపై వాహనదారుల మండిపడుతున్నారు.